World Bank India Growth: ఈ ఏడాది వృద్ధి 7.2 శాతం
ABN , Publish Date - Jan 15 , 2026 | 06:21 AM
ప్రపంచ బ్యాంకు భారత వృద్ధిరేటును గణనీయంగా పెంచింది. వర్తమాన ఆర్థిక సంవత్స రంలో భారత్ 7.2% వృద్ధిని నమోదు చేస్తుందని...
అంచనా భారీగా పెంచిన ప్రపంచ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంకు భారత వృద్ధిరేటును గణనీయంగా పెంచింది. వర్తమాన ఆర్థిక సంవత్స రంలో భారత్ 7.2% వృద్ధిని నమోదు చేస్తుందని తాజాగా అంచనా వేసింది. జూన్‌లో ప్రకటించిన అంచ నాల కన్నా ఇది 0.9% అధికం. పన్ను సంస్కరణలు, భారీగా పెరిగిన వస్తుసేవల డిమాండు ఇందుకు ఊతం ఇస్తాయని తాజా నివేదికలో తెలిపింది. కాని 2026-27 ఆర్థిక సంవత్సరంలో మాత్రం వృద్ధి 6.5 శాతానికి మందగిస్తుందని అంచనా వేసింది. అయి నా కూడా ప్రపంచంలో వేగంగా వృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని కాపాడు కోగలుగుతుందని పేర్కొంది. అమెరికా ప్రతికూల సుంకాల ప్రభావాన్ని బలమైన దేశీయ డిమాండు, ఎగుమతుల రంగం స్థితి స్థాపకత తటస్థం చేయ వచ్చునని తెలిపింది. పన్ను సంస్కరణల ప్రభావంతో దేశంలో వస్తుసేవల డిమాండు బలంగా ఉన్నదని, గ్రామీణ గృహస్థుల వాస్తవిక ఆదాయాలు మెరుగు పడ్డాయని పేర్కొంది.
ఇవీ చదవండి
ప్రయత్నం విఫలమైనా ప్రార్థనలు విఫలం కావు.. డీకే ఆసక్తికర పోస్ట్
జనవరి19న మళ్లీ సీబీఐ విచారణకు విజయ్..