Share News

ఈ ఏడాది భారత వృద్ధి 6.6 వృద్ధి

ABN , Publish Date - Apr 09 , 2026 | 04:11 AM

భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్‌ మరింత పెంచింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇది 6.6 శాతం వరకు ఉంటుందని తెలిపింది...

ఈ ఏడాది భారత వృద్ధి 6.6 వృద్ధి

ప్రపంచ బ్యాంక్‌

న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్‌ మరింత పెంచింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇది 6.6 శాతం వరకు ఉంటుందని తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేస్తున్న 7.6 శాతంతో పోలిస్తే ఇది ఒక శాతం తక్కువ. బుధవారం నాటి సమీక్షలో ఆర్‌బీఐ పేర్కొన్న 6.9 శాతంతో పోల్చినా ఇది 0.3 శాతం తక్కువ. ప్రపంచ బ్యాంక్‌ గత ఏడాది అక్టోబరులో విడుదల చేసిన ఒక నివేదికలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతం వరకు ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఇంధన సెగతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రిటైల్‌ ద్రవ్యోల్బణం పుంజుకున్నా, దేశీయ డిమాండ్‌, వినియోగం భారత జీడీపీకి దన్నుగా నిలుస్తాయని అంచనా వేసింది.

ఇవి కూడా చదవండి..

ట్రంప్ గుడ్ న్యూస్.. దేశీయ సూచీలకు ఫుల్ జోష్..

ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..

Updated Date - Apr 09 , 2026 | 04:11 AM