Share News

స్వల్పంగా తగ్గిన విప్రో లాభం

ABN , Publish Date - Oct 16 , 2026 | 05:54 AM

ఐటీ సర్వీసుల కంపెనీ విప్రో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి రూ.3,200.6 కోట్ల నికర లాభాన్ని...

స్వల్పంగా తగ్గిన విప్రో లాభం

  • క్యూ2లో రూ.3,201 కోట్లుగా నమోదు

న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల కంపెనీ విప్రో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి రూ.3,200.6 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.3,246.2 కోట్ల లాభంతో పోల్చితే ఇది 1.40 శాతం మేర తగ్గింది. కార్యకలాపాల ఆదాయం రూ.22,697.3 కోట్ల నుంచి రూ.24,752.7 కోట్లకు పెరిగింది. త్రైమాసికం వారీగా చూస్తే కంపెనీ లాభం 4.5 శాతం తగ్గగా.. రాబడి 1 శాతం పెరిగింది. ఐటీ సర్వీసుల సెగ్మెంట్‌ రాబడి 261.15 కోట్ల డాలర్లుగా ఉంది. త్రైమాసికం వారీగా చూస్తే 0.1 శాతం తక్కువగా.. వార్షిక ప్రాతిపదికన అయితే 0.3 శాతం ఎక్కువగా నమోదైంది. విప్రో ఇతర ఆదాయం సమీక్షా త్రైమాసికంలో రూ.947.7 కోట్ల నుంచి రూ.755.5 కోట్లకు తగ్గింది. కాగా అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో ఐటీ సర్వీసుల వ్యాపార విభాగం నుంచి 257.1-262.5 కోట్ల డాలర్ల రాబడిని అంచనా వేస్తున్నట్టు విప్రో తెలిపింది. సెప్టెంబరు చివరినాటికి విప్రో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,716 తగ్గి 2,36,328కి చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో కంపెనీ దాదాపు 1,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంది.

ఈ వార్తలనూ చదవండి:

సిబిల్ స్కోర్ పడిపోయిందా..? ఆరు నెలల్లో పెంచుకోండిలా

ఫెయిర్‌ఫాక్స్‌ చేతికి ఐడీబీఐ బ్యాంకు

Updated Date - Oct 16 , 2026 | 05:54 AM