టోకు ధరలు భగ్గు
ABN , Publish Date - Nov 17 , 2026 | 06:11 AM
టోకు ద్రవ్యోల్బణం దూసుకుపోయింది. ఇంధనం, విద్యుత్, ఆహారేతర ఉత్పత్తుల ధరలు పెరగడంతో అక్టోబరులో ఇది 12.29 శాతంగా...
అక్టోబరులో 12.29 శాతానికి సూచీ
న్యూఢిల్లీ: టోకు ద్రవ్యోల్బణం దూసుకుపోయింది. ఇంధనం, విద్యుత్, ఆహారేతర ఉత్పత్తుల ధరలు పెరగడంతో అక్టోబరులో ఇది 12.29 శాతంగా నమోదైంది. 2022-23 ఆధార సంవత్సరంగా ఉన్న కొత్త టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) సిరీస్‌లో ఇదే అత్యధిక స్థాయి కావడం గమనార్హం. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు చల్లబడుతున్న నేపథ్యంలో నవంబరులో టోకు ద్రవ్యోల్బణం తగ్గవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ సెప్టెంబరులో టోకు ద్రవ్యోల్బణం 11.39 శాతంగా ఉంది. సెప్టెంబరులో 8.14 శాతంగా ఉన్న ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం అక్టోబరులో 8.26 శాతానికి పెరిగింది. ఆహారేతర వస్తువుల ద్రవ్యోల్బణం సెప్టెంబరులో 10.28 శాతంగా ఉండగా.. గత నెలలో 11.69 శాతానికి చేరింది.
ఇవీ చదవండి
జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!