టీవీ అమ్మకాలపై యుద్ధ ప్రభావం
ABN , Publish Date - Apr 06 , 2026 | 02:44 AM
యుద్ధ ప్రభావం వినోద పరిశ్రమపై కూడా పడుతోంది. ఇప్పటికే మెమరీ చిప్‌లు, ప్లాస్టిక్ ధరలు, రవాణా అంతరాయాల కారణంగా నిర్వహణా వ్యయాలు పెరిగిపోయిన నేపథ్యంలో అమ్మకాలు...
న్యూఢిల్లీ: యుద్ధ ప్రభావం వినోద పరిశ్రమపై కూడా పడుతోంది. ఇప్పటికే మెమరీ చిప్‌లు, ప్లాస్టిక్ ధరలు, రవాణా అంతరాయాల కారణంగా నిర్వహణా వ్యయాలు పెరిగిపోయిన నేపథ్యంలో అమ్మకాలు గణనీయంగా తగ్గవచ్చని టీవీ పరిశ్రమ భయపడుతోంది. ఇప్పటికే పెరిగిన ధరల కారణంగా కొందరు వినియోగదారుల పెద్ద టీవీలకు బదులు చిన్న టీవీలనే కొనుగోలు చేస్తున్నారు. కొందరైతే తమ కొనుగోలు ప్రయత్నాలను వాయిదా వేసుకున్నారు. రూపాయి క్షీణత కూడా స్థూల ఉత్పత్తి వ్యయాల పెరుగుదలకు కారణమైంది. పెద్ద బ్రాండ్లయితే పెరిగిన వ్యయ ఒత్తిడులను కొంతమేరకు భరించగలిగినా చిన్న ఉత్పత్తిదారులు మాత్రం ఈ పరిణామాల తీవ్రత ఎదుర్కొంటున్నారు. పోటీ తీవ్రతరంగా ఉన్న మార్కె ట్లో తమ వాటాను నిలబెట్టుకోవాలని కొన్ని కంపెనీలు పెరిగిన వ్యయాల భారాన్ని పూర్తిగా కస్టమర్లకు బదిలీ చేయకపోవడం కూడా వారికి ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో ద్వితీయార్ధంలోని పండుగల సీజన్‌లో మాత్రమే కొంతమేరకైనా రికవరీ ఏర్పడవచ్చని వారు భావిస్తున్నారు.
గత ఆరు నెలల కాలంలో దేశంలో టీవీల ధరలు విపరీతంగా పెరిగాయి. ఒక దశలో రూ.9,000కి దిగివచ్చిన 32 అంగుళాల టీవీ ధర ప్రస్తుతం రూ.11,000 పలుకుతోంది. కాస్తంత స్థితిమంతులైన కస్టమర్లు ఈఎంఐ ఆప్షన్లు ఎంచుకుని తాము ఊహించుకుంటున్న పెద్ద సైజు టీవీలనే కొనుగోలు చేసినా ధర ఆధారంగా నిర్ణయాలు తీసుకునే కస్టమర్లు మాత్రం చిన్న సైజు టీవీలకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు హాయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్‌ఎ్‌స సతీశ్ చెప్పారు. పెరిగిన ధరలతో డిమాండు క్షీణించిన కారణంగా టీవీల సరఫరా మొదటి త్రైమాసికంలో 5-6%, రెండో త్రైమాసికంలో 3-5% తగ్గవచ్చని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అంచనా.
ఇవి కూడా చదవండి..
టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై
ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు