Volatile Week Ahead for Indian Markets: ఆటుపోట్లకు అవకాశం..
ABN , Publish Date - Jan 12 , 2026 | 02:23 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం తీవ్ర ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా రాజకీయ పరిణామాలు మారుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. మరోవైపు...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం తీవ్ర ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా రాజకీయ పరిణామాలు మారుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. మరోవైపు ఎఫ్‌ఐఐలు వరుసపెట్టి అమ్మకాలు చేపట్టడం, ట్రంప్ టారిఫ్స్ బెదిరింపులు నెగటివ్ సెంటిమెంట్స్‌కు దారితీస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపిక చేసిన షేర్లలో పెట్టుబడి పెట్టడం మంచిది. ప్రస్తుతం పీఎ్‌సయూ బ్యాంక్, మెటల్, కమోడిటీస్, సీపీఎ్‌సఈ, ఆటో రంగాలు కొద్దిగా బలాన్ని ప్రదర్శిస్తున్నాయి.
స్టాక్ రికమండేషన్స్
హెచ్‌సీఎల్ టెక్: గత అక్టోబరు నుంచి 24 శాతం మేర రాణించిన ఈ షేరు ప్రస్తుతం మీడియం టర్మ్ నిరోధ స్థాయి వద్ద కదలాడుతున్నాయి. గత వారం కరెక్షన్‌తో స్వల్ప పుల్‌బ్యాక్‌కు లోనైంది. ఫలితాల సీజన్ మొదలవటం, రిలేటివ్ స్ట్రెంత్ పెరుగుతుండటం సానుకూల అంశం. గత శుక్రవారం రూ.1,661 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,650 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.1,750/1,800 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,620 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
హిందుస్థాన్ జింక్: గత సెప్టెంబరు నుంచి ఈ షేరు 50 శాతానికి పైగా రాబడిని అందించింది. ప్రస్తుతం లాంగ్ టర్మ్ అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. జీవితకాల గరిష్ఠం వైపు పరుగులు తీస్తోంది. గత వారం నిరోధాన్ని అధిగమించిన తర్వాత పుల్‌బ్యాక్‌కు లోనైంది. గత శుక్రవారం రూ.606 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.600 వద్ద ఎంటరై రూ.680 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.590 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
నేషనల్ అల్యూమినియం: గత ఏడాది మార్చి నుంచి 100 శాతం రాబడిని అందించిన ఈ షేరు ప్రస్తుతం జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతోంది. నిఫ్టీతో పోల్చితే జోరును ప్రదర్శిస్తోంది. రిలేటివ్ స్ట్రెంత్ మెరుగ్గా ఉంది. డిమాండ్ ఉన్న రంగం కావటంతో ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. గత శుక్రవారం రూ.348 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.340 శ్రేణిలో ప్రవేశించి రూ.430/450 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.320 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
కోఫోర్జ్: ఈ షేరు రూ.2,000 వద్ద గట్టి నిరోధాన్ని ఎదుర్కొన్న తర్వాత 22 సెషన్లలోనే 20 శాతం మేర పతనమైంది. మళ్లీ కీలకమైన రూ.1,600 మద్దతు స్థాయికి చేరుకుంది. ఫలితాల సీజన్ మొదలవుతుండటంతో పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.1,681 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.1,660/1,670 శ్రేణిలో ప్రవేశించి రూ.1,900 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,640 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
ఓఎన్‌జీసీ: జీవితకాల గరిష్ఠం నుంచి 45 శాతం మేర పతనమైన ఈ షేరు ప్రస్తుతం కీలక మద్దతు స్థాయి రూ.230కి చేరుకుంది. ఇక్కడ స్వల్ప టర్న్ అరౌండ్‌కు అవకాశం ఉంది. గత శుక్రవారం రూ.234వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.230 శ్రేణిలో ప్రవేశించి రూ.255/260 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.225 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఇవీ చదవండి:
ముసుగు ధరించి వస్తే గోల్డ్ విక్రయించం.. వర్తకుల కీలక నిర్ణయం..
ఇతడు మామూలోడు కాదు.. డబ్బు కోసం కట్టుకున్న భార్యను..