Share News

డీసీఎక్స్‌ క్రోమ్‌తో విష్ణు కెమికల్స్‌ జట్టు

ABN , Publish Date - Sep 09 , 2026 | 04:11 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న స్పెషాలిటీ కెమికల్స్‌ తయారీ సంస్థ విష్ణు కెమికల్స్‌ లిమిటెడ్‌ (వీసీఎల్‌) సంస్థ తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది. ఇందులో భాగంగా...

డీసీఎక్స్‌ క్రోమ్‌తో విష్ణు కెమికల్స్‌ జట్టు

విశాఖపట్నంలో క్రోమియం ప్లాంట్‌ ఏర్పాటు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న స్పెషాలిటీ కెమికల్స్‌ తయారీ సంస్థ విష్ణు కెమికల్స్‌ లిమిటెడ్‌ (వీసీఎల్‌) సంస్థ తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది. ఇందులో భాగంగా అత్యంత స్వచ్ఛమైన అలుమినోథెర్మిక్‌ క్రోమియం మెటల్‌, ప్రత్యేక క్రోమియం పౌడర్ల ఉత్పత్తిలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం ఫ్రాన్స్‌ కేంద్రంగా పనిచేసే డీసీఎక్స్‌ క్రోమ్‌ ఎస్‌ఏఎస్‌ అనే కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద రెండు కంపెనీలు చెరి సగం వాటాతో జాయింట్‌ వెంచర్‌ (జేవీ)ను ఏర్పాటు చేయనున్నాయి. ఈ జేవీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 6,000 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యంతో ప్లాంటు ఏర్పాటు చేయనుంది. అత్యంత స్వచ్ఛమైన ఈ క్రోమియం మెటల్‌, పౌడర్లను వైమానిక, అణు ఇంధనం, కెమికల్‌ ప్రాసెస్‌ పరిశ్రమలు, లోతట్టు సముద్ర జలాల్లో చమురు, సహజ వాయువుల కోసం జరిపే అన్వేషణల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రత్యేక రసాయనాల ఉత్పత్తిలో మా స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకోవడంలో ఫ్రాన్స్‌ కంపెనీతో కలిసి ఏర్పాటు చేసే ఈ జేవీ ఒక ప్రధాన మైలురాయి అని విష్ణు కెమికల్స్‌ సీఎండీ చెరుకూరి కృష్ణమూర్తి తెలిపారు. అయితే ఈ జాయింట్‌ వెంచర్‌ కోసం ఎంత పెట్టుబడి పెట్టేది రెండు కంపెనీలు వెల్లడించలేదు.

ఇవి కూడా చదవండి:

గిల్‌పై ప్రతీకారం తీర్చుకున్న అభిషేక్ శర్మ.. వీడియో వైరల్!

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్.. వాషింగ్టన్ సుందర్ ఫిట్

Updated Date - Sep 09 , 2026 | 04:11 AM