Share News

సిటీ యూనియన్‌ బ్యాంక్‌ ఎండీగా విజయ్‌ ఆనంద్‌

ABN , Publish Date - Apr 30 , 2026 | 04:33 AM

సిటీ యూనియన్‌ బ్యాంక్‌ (సీయూబీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా విజయ్‌ ఆనంద్‌.. మే 1వ తేదీన బాధ్యతలు చేపట్టనున్నారు..

సిటీ యూనియన్‌ బ్యాంక్‌ ఎండీగా విజయ్‌ ఆనంద్‌

చెన్నై: సిటీ యూనియన్‌ బ్యాంక్‌ (సీయూబీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా విజయ్‌ ఆనంద్‌.. మే 1వ తేదీన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు బుధవారం సీయూబీ ఒక ప్రకటనలో తెలిపింది. డాక్టర్‌ ఎన్‌ కామకోడి స్థానంలో ఆనంద్‌ బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది. బ్యాంకింగ్‌ రంగంలో 28 ఏళ్ల అనుభవం కలిగిన ఆనంద్‌.. 2023లో సీయూబీలో ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌గా చేరారు. మరుసటి సంవత్సరంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. సీయూబీలో చేరడానికి ముందు ఆర్‌బీఎల్‌ బ్యాంకులో రిటైల్‌ అసెట్స్‌ విభాగానికి బిజినెస్‌ అండ్‌ కలెక్షన్స్‌ హెడ్‌గా పనిచేశారు. కాగా బోర్డు నిర్ణయం నేపథ్యంలో డాక్టర్‌ కామకోడి సీయూబీ ఫౌండేషన్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదిలా ఉండగా.. బ్యాంకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.1,326 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం కన్నా ఇది 18 శాతం అధికం.

ఇవి కూడా చదవండి..

పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 8 మంది మృతి..

Updated Date - Apr 30 , 2026 | 04:34 AM