టార్పెడోల తయారీ కోసం వేమ్ టెక్నాలజీ్‌సతో టీకేఎంఎస్ జట్టు
ABN , Publish Date - Mar 11 , 2026 | 05:58 AM
రక్షణ ఉత్పత్తుల రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న హైదరాబాద్ సంస్థ వేమ్ టెక్నాలజీ్‌సతో ప్రపంచంలోని ప్రఖ్యాత నౌకాదళ కంపెనీల్లో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): రక్షణ ఉత్పత్తుల రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న హైదరాబాద్ సంస్థ వేమ్ టెక్నాలజీ్‌సతో ప్రపంచంలోని ప్రఖ్యాత నౌకాదళ కంపెనీల్లో ఒకటైన టీకేఎంఎస్ చేతులు కలిపింది. ఇందుకు అనుగుణంగా టీమింగ్ ఒప్పందంపై రెండు కంపెనీలు సంతకాలు చేశాయి. ఈ అంగీకారంలో భాగంగా ఉభయ కంపెనీలు టార్పెడోల నిర్మాణానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేసుకోవడంతో పాటు మేకిన్ ఇండియా భారీ టార్పెడోల సంయుక్త అభివృద్ధికి కృషి చేస్తాయి. మధ్యకాలికంగా భారత మార్కెట్‌కు అధిక నాణ్యత, బరువు గల టార్పెడోల సరఫరా కోసం రెండు కంపెనీలు జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసే ఆస్కారం సైతం ఉంది. భారత నౌకాదళంలో ఉన్న జలాంతర్గాములకు అవసరమైన అధిక బరువు గల టార్పెడోల నిర్మాణానికి తొలి దశలో ఈ టీమింగ్ ఒప్పందం దోహదపడుతుందని అట్లాస్ ఎలక్ర్టానిక్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ ఓజెగోవ్‌స్కీ అన్నారు.
ఇవి కూడా చదవండి..
నష్టాల నుంచి ఉపశమనం.. కోలుకుంటున్న దేశీయ సూచీలు..
ఇరాన్ యుద్ధం.. పెట్రోల్, గ్యాస్, ఎరువుల నిల్వలు సరిపోతాయా..