Share News

వేదాంత లాభంలో రెండింతల వృద్ధి

ABN , Publish Date - Oct 29 , 2026 | 05:01 AM

మైనింగ్‌ దిగ్గజం వేదాంత.. సెప్టెంబరుతో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో రూ.3,650 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది...

వేదాంత లాభంలో రెండింతల వృద్ధి

న్యూఢిల్లీ: మైనింగ్‌ దిగ్గజం వేదాంత.. సెప్టెంబరుతో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో రూ.3,650 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.1,798 కోట్లు)తో పోల్చితే లాభం ఏకంగా రెండింతలు వృద్ధి చెందింది. కమోడిటీ ధరలు పెరగటం, ఫారెక్స్‌ లాభాలు సానుకూలంగా ఉండటంతో పాటు అమ్మకాలు పెరగటం ఇందుకు కలిసివచ్చిందని కంపెనీ తెలిపింది. త్రైమాసిక సమీక్షా కాలంలో కంపెనీ ఆదాయం కూడా రూ.16,736 కోట్ల నుంచి రూ.26,356 కోట్లకు పెరిగింది. కాగా ఉత్పత్తి సామర్థ్యం పెంపు, గనుల అభివృద్ధి తదితరాల కోసం రూ.1,135 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు కంపెనీ తెలిపింది.

ఇవి కూడా చదవండి...

యానాంలో ఆర్నబ్ తుఫాను విలయం

కాకినాడ సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 05:01 AM