భారత ఏఐ, క్లౌడ్ మార్కెట్‌పై అమెరికా కంపెనీల ఫోకస్
ABN , Publish Date - Jun 26 , 2026 | 05:36 AM
భారత ఏఐ, క్లౌడ్ సేవల మార్కెట్‌పై పట్టు కోసం అమెరికా టెక్నాలజీ కంపెనీలు పోటాపోటీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దేశంలో ఏఐ, క్లౌడ్ మౌలిక సదుపాయాల...
భారత ఏఐ, క్లౌడ్ సేవల మార్కెట్‌పై పట్టు కోసం అమెరికా టెక్నాలజీ కంపెనీలు పోటాపోటీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దేశంలో ఏఐ, క్లౌడ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇప్పటివరకు మొత్తం 5,700 కోట్ల డాలర్ల (దాదాపు రూ.5.42 లక్షల కోట్లు) పెట్టుబడులను ప్రకటించాయి.
మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద డేటా సెంటర్ త్వరలోనే ప్రారంభం కానుంది. అలాగే, గూగుల్ వైజాగ్‌లో భారీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీ్‌సతో కలిసి జామ్‌నగర్‌లో ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ఈ మధ్యనే ప్రకటించింది. భారత్ డేటా సెంటర్లు, ఏఐ మౌలిక వసతుల హబ్‌గా అవతరించేందుకు ఈ పెట్టుబడులు దోహదపడనున్నాయి.
ఇవి కూడా చదవండి:
పెళ్లి పేరుతో మోసం.. స్టార్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు!
కన్నీళ్లు పెట్టుకున్న బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్!