భారత్‌కు ఊరట
ABN , Publish Date - Feb 21 , 2026 | 02:05 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను ఆ దేశ సుప్రీంకోర్టు కొట్టివేయటంతో భారత్‌కు ఊరట లభించనుంది.
55ు ఎగుమతులకు మేలు..పెట్రో, స్మార్ట్‌ఫోన్లపై నో టారి్‌ఫలు
రొయ్యల ఎగుమతులకు బూస్ట్
వస్త్ర ఎగుమతుల్లో బంగ్లాతో పోటీ
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను ఆ దేశ సుప్రీంకోర్టు కొట్టివేయటంతో భారత్‌కు ఊరట లభించనుంది. సుప్రీంకోర్టు నిర్ణయంతో దాదాపు 55 శాతం భారత ఎగుమతులపై ప్రస్తుతం ఉన్న 18 శాతం సుంకాల భారం 3 శాతానికి తగ్గుతుందని భావిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు భారత ఎగుమతులపై 50 శాతంగా ఉన్న సుంకాలను ట్రంప్ సర్కార్ ఇటీవలే 18 శాతానికి కుదించింది.
వస్త్ర, మత్స్య ఎగుమతులకు దన్ను
అమెరికా సుప్రీంకోర్టు తాజా తీర్పుతో దాదాపు 55 శాతం భారత ఎగుమతులపై సుంకాల పోటు 3 శాతానికి తగ్గనుంది. మన దేశం నుంచి అమెరికాకు జరిగే ఎగుమతుల్లో విలువపరంగా దాదాపు 40 శాతం వాటా ఉన్న స్మార్ట్‌ఫోన్లు, ఔషధాలు, పెట్రోలియం ఉత్పత్తులపైనా సుంకాల పోటు పూర్తిగా తగ్గనుంది. ఈ తీర్పుతో మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి చేసే టెక్స్‌టైల్, రత్నాభరణాలు, తోలు ఉత్పత్తులు, మత్స్య ఎగుమతులకు కూడా ప్రయోజనం చేకూరనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి జరిగే రొయ్యల ఎగుమతులకూ పెద్ద ఊరట లభించనుంది. అయితే దుస్తులు, వస్త్రాల ఎగుమతుల్లో చైనా, బంగ్లాదేశ్‌ల నుంచి మాత్రం గట్టి పోటీ ఎదురు కానుంది.
కొన్ని రంగాలకు నిరాశ
సుంకాల చెల్లవని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా, కొన్ని భారత ఎగుమతులపై మాత్రం సుంకాల పోటు తప్పదని తెలుస్తోంది. ముఖ్యంగా స్టీల్, అల్యూమినియం, ఆటోమొబైల్ విడిభాగాల దిగుమతులపై అమెరికా 25 నుంచి 50 శాతం సుంకాలు విధించనుంది. అమెరికా జాతీయ ప్రయోజనాలకు ముప్పు అనే పేరుతో ట్రంప్ కొన్ని రంగాలకు చెందిన వస్తువుల దిగుమతులపై ఈ సుంకాల భారం మోపారు. ప్రస్తుత తీర్పులో అమెరికా సుప్రీంకోర్టు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ పరిధిలోకి వచ్చే భారత ఎగుమతులు దాదాపు 800 కోట్ల డాలర్ల వరకు ఉంటాయని పరిశ్రమల వర్గాల అంచనా. ఇటీవల కుదిరిన తాత్కాలిక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంతో అమెరికా మన ఎగుమతులపై విధించిన సుంకాలను 18 శాతానికి తగ్గించింది.
ప్రపంచ స్టాక్ మార్కెట్లకు జోష్
ట్రంప్ సుంకాలను రద్దు చేస్తున్నట్లు అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన వెంటనే యూఎస్ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లోంచి లాభాల్లోకి మళ్లాయి. ఒక దశలో ఎస్ అండ్ పీ 500 సూచీ 0.7 శాతం, నాస్‌డాక్ 1.2 శాతం, డౌజోన్స్ 0.60 శాతం పెరిగాయి. యూరప్ మార్కెట్లు సైతం లాభాల్లో ముగిశాయి. వచ్చే సోమవారం భారత స్టాక్ సూచీలూ భారీ లాభాలను నమోదు చేసే అవకాశాలున్నాయి. ఎందుకంటే, అంతర్జాతీయ మార్కెట్లో ట్రెండ్‌కు అనుగుణంగా శుక్రవారం రాత్రి సెషన్ (సాయంత్రం 4.35 గంటల నుంచి అర్ధరాత్రి 2.45 గంటల వరకు)లో గిఫ్ట్ నిఫ్టీ ఇంట్రాడే కనిష్ఠ స్థాయి నుంచి 400 పాయింట్ల మేర పుంజుకుంది. రాత్రి 12 గంటల సమయానికి సూచీ 246.50 పాయింట్ల (0.96 శాతం) లాభంతో 25,816 వద్ద ట్రేడైంది.
ఈ వార్తలు కూడా చదవండి
పీఎస్ఎల్వీ-సీ62 వైఫల్యంపై విశ్లేషణ కమిటీ
10గంటల నుంచి ఆ ఏరియాల్లో కరెంట్ కట్