Share News

గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Apr 13 , 2026 | 06:42 AM

గల్ఫ్‌లో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత్‌లో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..
Gold, Silver Rates on April 13

ఇంటర్నెట్ డెస్క్: గత వారం యూఎస్-ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటన తరువాత భారత్‌లో బంగారం, వెండి ధరలు ఓ మోస్తరు స్థాయిలో పెరిగాయి. బంగారం సగటున రూ.2,800ల మేర పెరిగింది. గల్ఫ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగడంతో ఈ వారం ధరలు తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, సోమవారం (ఏప్రిల్ 13) ఉదయం 6.30 గంటల సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,830గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,40,090ల వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.2,64,900 పలుకుతోంది. విజయవాడలో కూడా దాదాపు ఇవే రేట్స్ ఉన్నాయి.


చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గరిష్ఠంగా రూ.1,53,810ల వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా నగరాల్లో రూ.1,52,830గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చెన్నైలో రూ.1,40,990గా, ముంబై, కోల్‌కతా నగరాల్లో రూ.1,40,090ల వద్ద కొనసాగుతోంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.2,64,990గా ఉంది. ముంబైలో రూ.2,59,900ల వద్ద కొనసాగుతోంది. ఇతర నగరాల్లో కూడా వెండి ధర దాదాపు ఇదే రేంజ్‌లో కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర 4,677 డాలర్లుగా, ఔన్స్ వెండి ధర 73 డాలర్లుగా ఉంది.


ఈ వార్తలనూ చదవండి:

ఈ ఏడాది 25,000 మంది ఫ్రెషర్ల నియామకం: టీసీఎస్‌ ఎండీ కృతివాసన్‌

తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు.. 10 రోజుల్లో రూ.48,213 కోట్లు వెనక్కు..

Updated Date - Apr 13 , 2026 | 08:41 AM