10 రోజులు.. రూ.48,213 కోట్లు వెనక్కు..
ABN , Publish Date - Apr 13 , 2026 | 04:56 AM
భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు నిరవధికంగా తరలిపోతునే ఉన్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, స్థూల ఆర్థిక సవాళ్ల ...
న్యూఢిల్లీ: భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు నిరవధికంగా తరలిపోతునే ఉన్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, స్థూల ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో ఏప్రిల్ నెల ప్రారంభమైన కేవలం పది రోజుల్లోనే ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఏకంగా రూ. 48,213 కోట్లు వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు వెనక్కు తీసుకున్న పెట్టుబడులు రూ.1.8 లక్షల కోట్లు దాటాయి. మార్చి నెలలోనూ ఎఫ్‌పీఐలు రికార్డు స్థాయిలో రూ.1.17 లక్షల కోట్లు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. కాగా ఫిబ్రవరిలో ఈక్విటీల్లో రూ.22,615 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఎఫ్‌పీఐలు.. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరగటంతో పాటు అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం మళ్లీ పెరగవచ్చన్న ఆందోళనలతో వీరు పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ వస్తున్నారు. మరోవైపు రూపాయి పతనం కూడా ఎఫ్‌పీఐల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది.