Share News

అమెరికాలో వడ్డీ రేట్లు యథాతథం

ABN , Publish Date - Jun 18 , 2026 | 05:13 AM

అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వు కీలక వడ్డీ రేట్ల శ్రేణిని యథాతథంగా ప్రస్తుత 3.5- 3.75 శాతం వద్దే కొనసాగించాలని...

అమెరికాలో వడ్డీ రేట్లు యథాతథం

వాషింగ్టన్‌: అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వు కీలక వడ్డీ రేట్ల శ్రేణిని యథాతథంగా ప్రస్తుత 3.5- 3.75 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. వడ్డీ రేట్లు తగ్గించాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచి ఒత్తిళ్లు ఉన్నా ఫెడ్‌ కొత్త చైర్మన్‌ కెవిన్‌ వార్ష్‌ ఏ మాత్రం పట్టించుకోలేదు. ద్రవ్యోల్బణం 4.2 శాతానికి చేరినా గత నెల రిటైల్‌ అమ్మకాలు బాగా పుంజుకోవడం, ఇరాన్‌పై యుద్ధం ముగియడంతో ధరల సెగ తగ్గుతుందనే అంచనాలు ఇందుకు ప్రధానంగా దోహదం చేశాయి. అయితే ఈ ఏడాది వడ్డీ రేట్ల పెంపు తప్పకపోవచ్చని కొంత మంది ఫెడ్‌ రిజర్వు అధికారులు చెప్పడంతో అమెరికా స్టాక్‌ మార్కెట్ల జోరుకు కాస్త బ్రేక్‌ పడింది.

ఇవీ చదవండి:

సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్

Updated Date - Jun 18 , 2026 | 05:13 AM