Share News

ఫలించిన చర్చలు.. టారిఫ్‌లు తగ్గించడానికి ఓకే చెప్పిన ట్రంప్

ABN , Publish Date - Feb 03 , 2026 | 06:59 AM

భారత్‌తో వాణిజ్య ఒప్పందాలకు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. ప్రతీకార టారిఫ్‌లను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడానికి ఓకే చెప్పారు. సోమవారం ఫోన్ ద్వారా ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్‌ల మధ్య సంభాషణ జరిగింది.

ఫలించిన చర్చలు.. టారిఫ్‌లు తగ్గించడానికి ఓకే చెప్పిన ట్రంప్
India US trade deal

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: భారత్, అమెరికాల మధ్య టారిఫ్‌ల యుద్ధానికి తెరపడింది. రెండు దేశాల మధ్య తాజాగా జరిగిన వాణిజ్య పరమైన చర్చలు ఫలించాయి. భారత్‌తో వాణిజ్య ఒప్పందాలకు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. ప్రతీకార టారిఫ్‌లను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడానికి ఓకే చెప్పారు. సోమవారం ఫోన్ ద్వారా ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్‌ల మధ్య సంభాషణ జరిగింది. ఈ విషయాన్ని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. ఇక, వాణిజ్య ఒప్పందాలపై ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ది ట్రూత్‌’లో సోమవారం ఓ పోస్టు పెట్టారు.


ఆ పోస్టులో.. ‘భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడటాన్ని గౌరవంగా భావిస్తున్నా. నాకున్న గొప్ప స్నేహితులలో ఆయన కూడా ఒకరు. మేమిద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. బిజినెస్, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ముగింపు, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు నిలిపివేత.. అమెరికా, వెనెజువెలా నుంచి భారత్ మరింత ఆయిల్ కొనుగోలు అంశాలపై మాట్లాడుకున్నాం. ఈ చర్చలతో ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకటం ఖాయం అని అనుకుంటున్నా. మోదీపై గౌరవంతో వెంటనే వాణిజ్య ఒప్పందాలకు అంగీకరిస్తున్నా’..


‘అమెరికా ఉత్పత్తులను భారీగా కొనేందుకు భారత ప్రధాని కట్టుబడి ఉన్నారు. ఆయిల్, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గుతో పాటు ఇతర ఉత్పత్తులను అదనంగా కొనేందుకు భారత్ సిద్ధంగా ఉంది. మోదీతో మాకున్న అద్భుతమైన బంధం మునుపెన్నడూ లేనంతగా బలంగా ముందుకు సాగుతుంది. మోదీ, నేను అన్ని విషయాలను చక్కబెడుతున్నాం’ అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ కూడా అమెరికాతో కుదిరిన ఒప్పందాలపై సోమవారం ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘అద్భుతమైన ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరఫున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చాలా చాలా ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు.


ఇవి కూడా చదవండి

ఏసీబీ రైడ్స్.. సచివాలయ అడ్మిన్ గుట్టు రట్టు

ఆ ఏరియాల్లో 10 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా బంద్

Updated Date - Feb 03 , 2026 | 07:07 AM