పండుగ సీజన్.. ఆల్ టైమ్ గరిష్ఠానికి యూపీఐ లావాదేవీలు
ABN , Publish Date - Nov 01 , 2026 | 09:16 PM
భారత్‌లో పండుగ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో యూపీఐ లావాదేవీలు జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. అక్టోబర్‌లో మొత్తం యూపీఐ లావాదేవీల సంఖ్య 25.47 బిలియన్‌లకు చేరుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో పండుగ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో యూపీఐ లావాదేవీలు జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. అక్టోబర్‌లో మొత్తం యూపీఐ లావాదేవీల సంఖ్య 25.47 బిలియన్‌లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 23 శాతం మేర వృద్ధి నమోదైందని ఎన్‌పీసీఐ గణాంకాలు చెబుతున్నాయి. అక్టోబర్ నెలలో యూపీఐ లావాదేవీల విలువ గతేడాదితో పోలిస్తే 16 శాతం మేర పెరిగి రూ.31.53 లక్షల కోట్లకు చేరుకుంది.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో యూపీఐ లావాదేవీల సంఖ్య 24.07 బిలియన్లుగా, మొత్తం విలువ రూ.29.37 కోట్లుగా ఉంది. పండుగ సీజన్ నేపథ్యంలో అక్టోబర్‌లో లావాదేవీలు బాగా పెరిగాయి. దసరా పండుగ, ఈకామర్స్ ఆఫర్స్ వంటి వాటితో లావాదేవీల్లో వృద్ధి నమోదైంది. అక్టోబర్ నెలలో రోజుకు సగటు లావాదేవీల సంఖ్య 822 మిలియన్లు. లావాదేవీల రోజువారీ సగటు విలువ తొలిసారిగా రూ.1.01 కోట్లకు చేరుకుంది. అక్టోబర్ 9న రోజువారీ లావాదేవీల సంఖ్య 873 మిలియన్ల గరిష్ఠ స్థాయిని తాకింది.
ధన త్రయోదశి, దీపావళి నేపథ్యంలో యూపీఐ లావాదేవీలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాల ధరలు సగటున 30 నుంచి 40 శాతం మేర పెరిగాయన్న వార్తలు ఉన్నప్పటికీ ఈ పండుగ సీజన్‌లో కొనుగోళ్లు జోరందుకోవడం కొసమెరుపు.
ఈ వార్తలనూ చదవండి:
జీఎస్టీ వసూళ్లలో భారీ పెరుగుదల.. అక్టోబర్‌లో రూ.2.31 లక్షల కోట్లు..
స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర..