2025-26లో.. రూ.314 లక్షల కోట్ల యూపీఐ లావాదేవీలు
ABN , Publish Date - May 01 , 2026 | 04:57 AM
డిజిటల్ చెల్లింపు సేవలను అత్యంత సులభతరంగా మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫే్‌స (యూపీఐ) ద్వారా జరిగిన మొత్తం లావాదేవీల విలువ గత ఆర్థిక సంవత్సరం...
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపు సేవలను అత్యంత సులభతరంగా మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫే్‌స (యూపీఐ) ద్వారా జరిగిన మొత్తం లావాదేవీల విలువ గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో రూ.314 లక్షల కోట్లు దాటింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అభివృద్ధి చేసిన యూపీఐ సేవలు 2016 ఆగస్టు 11న ప్రారంభమయ్యాయి. ఆ ఆర్థిక సంవత్సరం (2016-17)లో కేవలం రూ.0.07 లక్షల కోట్ల యూపీఐ లావాదేవీలు నమోదు కాగా.. గడిచిన పదేళ్లలో విలువ 4,000 రెట్లకు పైగా పెరిగింది. అంతేకాదు, 2016 -17లో కేవలం 2 కోట్ల యూపీఐ లావాదేవీలు జరగగా.. 2025-26లో ఈ సంఖ్య 24,162 కోట్లు మించిపోయింది. అంటే, లావాదేవీలు 12,000 రెట్లకు పైగా పెరిగాయి. అంతేకాదు, యూపీఐ నెలవారీ లావాదేవీలు గత ఏడాది ఆగస్టులో తొలిసారిగా 2,000 కోట్ల మైలురాయిని దాటాయి. 2025 డిసెంబరులో ఆల్‌టైం రికార్డు స్థాయి లో 2,163 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. గత ఏడాది యూపీఐ ద్వారా మొత్తం 22,000 కోట్ల లావాదేవీలు జరిగాయి. రోజుకు దాదాపు 60 కోట్లన్నమాట.
ఇవి కూడా చదవండి
స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు రెగ్యులర్‌గా మార్పు
చైల్డ్ ట్రాఫికింగ్.. ఫెర్టిలిటీ సెంటర్లపై గుజరాత్ పోలీసుల దాడులు