Share News

యూపీఐ లావాదేవీల్లో రికార్డ

ABN , Publish Date - Jun 02 , 2026 | 05:04 AM

భారతీయుల డిజిటల్‌ చెల్లింపులు సరికొత్త రికార్డు స్థాయికి పెరిగాయి. గత నెల యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫే్‌స (యూపీఐ) ద్వారా రూ.29.9 లక్షల కోట్ల...

యూపీఐ లావాదేవీల్లో రికార్డ

మే నెలలో రూ.30 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: భారతీయుల డిజిటల్‌ చెల్లింపులు సరికొత్త రికార్డు స్థాయికి పెరిగాయి. గత నెల యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫే్‌స (యూపీఐ) ద్వారా రూ.29.9 లక్షల కోట్ల విలువైన 2,320 కోట్ల లావాదేవీలు జరిగాయని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన రూ.29.03 లక్షల కోట్లతో పోలిస్తే ఇది రూ.87,000 కోట్లు ఎక్కువ. గత ఏడాది మేతో పోల్చినా ఇది 19 శాతం (రూ.4.76 లక్షల కోట్లు) ఎక్కువని ఎన్‌పీసీఐ పేర్కొంది. లావాదేవీల పరిమాణంపరంగా చూసినా ఈ ఏడాది మే నెలలో యూపీఐ లావాదేవీలు సరికొత్త రికార్డు సృష్టించాయి. గత ఏడాది మే నెలలో 1,867 కోట్ల లావాదేవీలు నమోదు కాగా, ఈ ఏడాది మేలో అవి 24 శాతం వృద్ధి రేటుతో 2,320 కోట్లకు చేరాయి. గత నెల రికార్డు స్థాయి యూపీఐ లావాదేవీలకు వేసవి ప్రయాణాలు, ఐపీఎల్‌, వినియోగదారులు సీజనల్‌గా చేసే కొనుగోళ్లు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి...

ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్

చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం

Updated Date - Jun 02 , 2026 | 05:04 AM