Share News

యూపీఐ చెల్లింపుల్లో పెరగనున్న గోప్యత

ABN , Publish Date - Jul 30 , 2026 | 03:35 AM

యూపీఐ చెల్లింపు వ్యవస్థను నిర్వహిస్తున్న నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) వినియోగదారుల డేటా భద్రత...

యూపీఐ చెల్లింపుల్లో పెరగనున్న గోప్యత

న్యూఢిల్లీ: యూపీఐ చెల్లింపు వ్యవస్థను నిర్వహిస్తున్న నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) వినియోగదారుల డేటా భద్రత, గోప్యతను పెంచే చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా వినియోగదారుల ఫోన్‌ నంబర్లు కనిపించకుండా మాస్కింగ్‌ చేయాలని ఇదివరకే యూపీఐ యాప్‌లు, బ్యాంకులను ఆదేశించింది. దీన్ని అమలు చేయడానికి సెప్టెంబరు 4 వరకు గడువు ఇచ్చింది. ప్రస్తుతం యూపీఐ చెల్లింపులు చేయడంలో ఫోన్‌ నంబర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వినియోగదారులను గుర్తించడానికి, లావాదేవీలను ధ్రువీకరించడానికి ఫోన్‌ నంబర్లు సహాయపడతాయి. అయితే లావాదేవీ సమయంలో వినియోగదారుల ఫోన్‌ నంబర్లు బహిర్గతం కావడం మూలంగా భద్రత, గోప్యతా సమస్యలు తలెత్తుతున్నాయంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు బాక్సర్లు సాక్షి, అరుంధతి.. భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయం!

విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ.. లోక్‌సభ ఆమోదంతో పేపర్ లీక్‌లకు చెక్: కేంద్ర మంత్రి అమిత్ షా

Updated Date - Jul 30 , 2026 | 03:35 AM