యూపీఐ లావాదేవీలకూ ‘సైబర్’ ముప్పు
ABN , Publish Date - Mar 12 , 2026 | 05:01 AM
యూపీఐ చెల్లింపుల వ్యవస్థలోకీ సైబర్ కేటుగాళ్లు చొరబడుతున్నారు. ఏపీకే ఫైల్స్ పంపించి బ్యాంకు కస్టమర్ల ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే దేశ వ్యాప్తంగా...
న్యూఢిల్లీ: యూపీఐ చెల్లింపుల వ్యవస్థలోకీ సైబర్ కేటుగాళ్లు చొరబడుతున్నారు. ఏపీకే ఫైల్స్ పంపించి బ్యాంకు కస్టమర్ల ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే దేశ వ్యాప్తంగా 20 ముఠాలు చురుగ్గా పని చేస్తున్నట్టు సైబర్ సెక్యూరిటీ కన్సల్టెన్సీ సంస్థ క్లౌడ్‌సెక్ ఒక నివేదికలో తెలిపింది. ఒక్కో ముఠాలో 100 మంది వరకు సభ్యులున్నట్టు పేర్కొంది. వీరంతా ‘డిజిటల్ లుటెరా’ పేరుతో మొబైల్ ఫోన్ల వినియోగదారులకు ట్రాఫిక్ పైన్ నోటీసులు, వెడ్డింగ్ ఇన్విటేషన్లను ఏపీకే ఫైల్స్ రూపంలో పంపించి, వారి ఫోన్లలో తమ ప్రత్యేక మాల్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేస్తున్నారు.
తర్వాత వినియోగదారుల మొబైల్ సిమ్‌ను తమ స్వాధీనంలోకి తీసుకుని, వారి యూపీఐ లావాలేదీవీల సమాచారం కొట్టేసి ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. క్లౌడ్‌సెక్ సంస్థ ఈ విషయాన్ని ఇప్పటికే యూపీఐ చెల్లింపుల సంస్థ ఎన్‌పీసీఐ, బ్యాంకులకు తెలియజేసి జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
ఇవి కూడా చదవండి..