త్వరలోనే యూపీఐ చార్జీలు!?
ABN , Publish Date - Aug 14 , 2026 | 04:52 AM
డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత పటిష్టంగా మార్చడంతోపాటు ప్రభుత్వ ఖజనాపై భారాన్ని తగ్గించేందుకు అధిక విలువైన లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)ను...
అధిక విలువైన లావాదేవీలపై ‘ఎండీఆర్’ను అమలు చేయాలి..
ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత పటిష్టంగా మార్చడంతోపాటు ప్రభుత్వ ఖజనాపై భారాన్ని తగ్గించేందుకు అధిక విలువైన లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)ను వీలైనంత త్వరగా అమలు చేయాలని ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. చిన్న వ్యాపారులు, వ్యక్తి నుంచి వ్యక్తికి (పీ-టు-పీ) జరిగే డిజిటల్ లావాదేవీలను మినహాయించి, అధిక విలువైన వ్యాపార లావాదేవీలపై మాత్రమే తగిన స్థాయిలో ఎండీఆర్‌ను విధించాలని సూచించింది. ప్రస్తుతం రుపే డెబిట్ కార్డులు, తక్కువ విలువైన భీమ్-యూపీఐ లావాదేవీలపై జీరో-ఎండీఆర్ అమల్లో ఉండడంతో పరిశ్రమకు అవసరమైన ఆదాయం లభించడంలేదని కమిటీ తెలిపింది. దీంతో డిజిటల్ చెల్లింపుల సంస్థలు సైబర్ సెక్యూరిటీ, మోసాల నిరోధక వ్యవస్థలు, నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలపై తగినంత పెట్టుబడులు పెట్టలేకపోతున్నాయని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి
డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు..
అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు..