అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్‌గా ఉపాసన
ABN , Publish Date - Sep 25 , 2026 | 04:39 AM
అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్)గా ఉపాసన కామినేని కొణిదెల బాధ్యతలు స్వీకరించారు....
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్)గా ఉపాసన కామినేని కొణిదెల బాధ్యతలు స్వీకరించారు. కొత్త ఆస్పత్రుల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న ఆస్పత్రుల ఆధునికీకరణ, విస్తరణ వంటి అన్ని కార్యక్రమాలను ఉపాసన పర్యవేక్షిస్తారు. అపోలో హాస్పిటల్స్ ఇప్పటికే రూ.8,000 కోట్ల పెట్టుబడులతో పెద్ద ఎత్తున విస్తరణ చేపట్టింది. ఇందులో రూ.1,565 కోట్లు ఇప్పటికే ఉన్న హాస్పిటల్స్ ఆధునికీకరణ, విస్తరణ కోసం వినియోగించబోతోంది. ఈ కార్యక్రమాలు అన్నిటిని డైరెక్టర్ హోదాలో ఉపాసన పర్యవేక్షించబోతున్నారు.
ఈ వార్తలనూ చదవండి
వృద్ధురాలి పాలిట మృత్యువులా వచ్చిన కోతి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
అహ్మదాబాద్ విషాదం.. విద్యార్థినిపైకి దూసుకెళ్లిన క్రేన్.. వీడియో వైరల్