యూకో బ్యాంక్ లాభం రూ.786 కోట్లు
ABN , Publish Date - Oct 16 , 2026 | 05:52 AM
ప్రభుత్వ రంగంలోని యూకో బ్యాంక్.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని యూకో బ్యాంక్.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి గాను బ్యాంక్ నికర లాభం 27 శాతం వృద్ధి చెంది రూ.786 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ.620 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం రూ.7,421 కోట్ల నుంచి రూ.8,170 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో వడ్డీ ఆదాయం కూడా రూ.6,537 కోట్ల నుంచి రూ.7,286 కోట్లకు పెరగగా నిర్వహణా లాభం రూ.1,613 కోట్ల నుంచి రూ.1,872 కోట్లకు పెరిగిందని బ్యాంక్ పేర్కొంది. కాగా స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) 2.56ు నుంచి 1.96 శాతానికి, నికర ఎన్పీఏలు 0.43ు నుంచి 0.18 శాతానికి తగ్గినట్లు యూకో బ్యాంక్ వెల్లడించింది. అయితే సెప్టెంబరు త్రైమాసికంలో మొండి బకాయిల కోసం చేసిన కేటాయింపులు మాత్రం రూ.405 కోట్ల నుంచి రూ.444 కోట్లకు పెరిగినట్లు బ్యాంక్ పేర్కొంది. ప్రొవిజన్ కవరేజీ నిష్పత్తి 98.36 శాతంగా ఉంది. సెప్టెంబరు త్రైమాసికం ముగిసే నాటికి బ్యాంక్ మొత్తం వ్యాపారం 18.81 శాతం పెరిగి రూ.6,37,280 కోట్లకు చేరుకుంది.
ఈ వార్తలనూ చదవండి:
సిబిల్ స్కోర్ పడిపోయిందా..? ఆరు నెలల్లో పెంచుకోండిలా
ఫెయిర్ఫాక్స్ చేతికి ఐడీబీఐ బ్యాంకు