Share News

టీవీఎస్‌ మోటార్‌ నుంచి ఆర్బిటర్‌ వీ1 ఈవీ

ABN , Publish Date - Mar 13 , 2026 | 02:25 AM

ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటా ర్‌ కంపెనీ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ టీవీఎస్‌ ఆర్బిటర్‌ వీ1 విడుదల చేసింది. అర్బన్‌ రైడర్స్‌ కోసం...

టీవీఎస్‌ మోటార్‌ నుంచి ఆర్బిటర్‌ వీ1 ఈవీ

చెన్నై: ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటా ర్‌ కంపెనీ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ టీవీఎస్‌ ఆర్బిటర్‌ వీ1 విడుదల చేసింది. అర్బన్‌ రైడర్స్‌ కోసం ఈ స్కూటర్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. 1.8 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీతో కూడిన ఈ స్కూటర్‌ ఒకసారి చార్జింగ్‌తో 86 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని పేర్కొంది. ఈ స్కూటర్‌ ధర రూ.84,500 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌). కాగా బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌ (బాస్‌)తో ఆర్బిటర్‌ అందుబాటులో ఉంటుందని, ప్రారంభ ధర రూ.49,999 గా నిర్ణయించినట్లు టీవీఎస్‌ తెలిపింది. కాగా ఆర్బిటర్‌ వీ2 మోడల్‌ 3.1 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీతో అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి..

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు.. కూతురితో కలిసి వీక్షించిన కిమ్..

Updated Date - Mar 13 , 2026 | 02:26 AM