నాకు సమాన వాటా ఇవ్వాల్సిందే..
ABN , Publish Date - Nov 26 , 2026 | 04:44 AM
టీవీఎస్ పారిశ్రామిక కుటుంబంలో ఇంటి పోరు మరింత ముదిరింది. టీవీఎస్ గ్రూప్ అధినేత వేణు శ్రీనివాసన్‌కు వ్యతిరేకంగా ఆయన కుమార్తె...
మద్రాస్ హైకోర్టులో లక్ష్మీ వేణు పిటిషన్
న్యూఢిల్లీ: టీవీఎస్ పారిశ్రామిక కుటుంబంలో ఇంటి పోరు మరింత ముదిరింది. టీవీఎస్ గ్రూప్ అధినేత వేణు శ్రీనివాసన్‌కు వ్యతిరేకంగా ఆయన కుమార్తె లక్ష్మీ వేణు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఉమ్మడి కుటుంబ ఆస్తుల్లో సమాన వాటాతో పాటు, తాత, ముత్తాతల నుంచి సంక్రమించిన ఆస్తుల వివరాల పత్రాలూ తనకు ఇచ్చేలా తండ్రి వేణు శ్రీనివాసన్‌ను ఆదేశించాలని హైకోర్టును కోరారు. ఆస్తుల పంపకం కోసం ఈ నెల 16న ఇచ్చిన నోటీసుకు తండ్రి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమె ఈ చర్య తీసుకున్నారు. కుటుంబ ఆస్తుల్లో సోదరుడు సుదర్శన్ వేణుతో సమానంగా తనకూ వాటా పంచాలని లక్ష్మీ వేణు గత ఏడాది కాలంగా కోరుతున్నారు. కాగా తన పోరు తాత, ముత్తాతల నుంచి సంక్రమించిన ఉమ్మడి ఆస్తుల యాజమ్యానంపై మాత్రమేనని లక్ష్మీ వేణు స్పష్టం చేశారు. అంతే తప్ప తండ్రి నేతృత్వంలోని ఏ కంపెనీ నిర్వహణ కోసం కాదని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా
ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్