విస్తరణ బాటలో ట్రూజన్ సోలార్
ABN , Publish Date - Feb 28 , 2026 | 02:06 AM
ట్రూజన్ సోలార్ బ్రాండ్‌తో సౌర విద్యుత్ ఉత్పత్తుల సేవలందించే సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్ వ చ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో రూ.600-650 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ట్రూజన్ సోలార్ బ్రాండ్‌తో సౌర విద్యుత్ ఉత్పత్తుల సేవలందించే సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్ వ చ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో రూ.600-650 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో కంపెనీ ఆదాయం రూ.300-350 కోట్ల ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని, కార్యకలాపాల విస్తరణలో భాగంగా నిర్దేశిత లక్ష్యాన్ని అందుకోవచ్చని భావిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, ఎండీ సీహెచ్ భవానీ సురేశ్ తెలిపారు. విస్తరణలో భాగంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ (బీఈఎస్) విభాగంలోకి ప్రవేశించాలని చూస్తున్నట్లు ఆయన చెప్పారు. ట్రూజన్ సోలార్ బ్రాండ్ కింద ఇప్పటి వరకు రెసిడెన్షియల్, వాణిజ్య తదితర విభాగాల్లో 10,000కు పైగా రూఫ్‌టాప్ సోలార్ సొల్యూషన్స్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కంపెనీ ప్రధానంగా కార్యకలాపాలు సాగిస్తోందని, రానున్న నెలల్లో కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు కార్యకలాపాలు విస్తరించనున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటి వరకు రూ.80 కోట్లు పెట్టుబడులు పెట్టగా కంపెనీ చేతిలో రూ.250 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయని సురేశ్ వెల్లడించారు.
ఈ వార్తలూ చదవండి
ఏఐ వల్లే 4 వేల మందిని తీసేస్తున్నాము: జాక్ డోర్సీ
కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ