Share News

ట్రెడెన్స్‌ హైదరాబాద్‌ జీసీసీ విస్తరణ

ABN , Publish Date - Feb 18 , 2026 | 02:09 AM

హైదరాబాద్‌లోని గ్లోబల్‌ క్యాపబిలిటీ కేంద్రాన్ని (జీసీసీ) మరింతగా విస్తరిస్తున్నట్లు డేటా సైన్స్‌, ఏఐ సొల్యూషన్స్‌ కంపెనీ ట్రెడెన్స్‌ ఇంక్‌ ప్రకటించింది. మంగళవారం...

ట్రెడెన్స్‌ హైదరాబాద్‌ జీసీసీ విస్తరణ

  • 2027 నాటికి 2,200 ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని గ్లోబల్‌ క్యాపబిలిటీ కేంద్రాన్ని (జీసీసీ) మరింతగా విస్తరిస్తున్నట్లు డేటా సైన్స్‌, ఏఐ సొల్యూషన్స్‌ కంపెనీ ట్రెడెన్స్‌ ఇంక్‌ ప్రకటించింది. మంగళవారం నాడిక్కడ బయో ఏషియాలో కంపెనీ సహ వ్యవస్థాపకులు, సీటీఓ సుమిత్‌ మెహ్రా మాట్లాడుతూ.. నానక్‌రాంగూడలో 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త డెలివరీ, ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ట్రెడెన్స్‌ జీసీసీలో 400 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా ఈ ఏడాది 700 మందిని నియమించుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది మరో 1,100 మందిని నియమించుకోవటంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,200 చేరనుందన్నారు. జీవ శాస్త్రాలు, హెల్త్‌కేర్‌, రిటైల్‌, కన్స్యూమర్‌ ప్యాకేజ్డ్‌ గూడ్స్‌ (సీపీజీ) సేవలందించే సంస్థలకు ఏఐ ఆధారిత సేవలను ఈ కొత్త కేంద్రం అందించనుందని ట్రెడెన్స్‌ వెల్లడించింది. సుమారు రూ.300 కోట్ల పెట్టుబడితో ట్రెడెన్స్‌ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది.

ఇవి కూడా చదవండి..

బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!

సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం

Updated Date - Feb 18 , 2026 | 02:09 AM