వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్‌లకు ప్రత్యేక టారిఫ్ ప్లాన్లు
ABN , Publish Date - Sep 23 , 2026 | 04:16 AM
టెలికాం కంపెనీలు డేటా సర్వీసులతో జత చేయకుండా వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్‌ల కోసం చవకగా ప్రత్యేక...
టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశాలు
న్యూఢిల్లీ: టెలికాం కంపెనీలు డేటా సర్వీసులతో జత చేయకుండా వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్‌ల కోసం చవకగా ప్రత్యేక టారిఫ్ ప్లాన్లను అందుబాటులోకి తేవడాన్ని తప్పసరి చేస్తూ టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం టెలికాం ఆపరేటర్లు ఆఫర్ చేస్తున్న 30 రోజులు అంతకంటే తక్కువ కాలపరిమితితో కూడి న డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, ఎస్‌ఎంఎస్ బండిల్డ్ ప్యాక్ తరహాలోనే ఈ ప్రత్యేక టారిఫ్ ప్లాన్లను సైతం అందుబాటులోకి తేవాలని ట్రాయ్ స్పష్టం చేసింది. తద్వారా డేటా అవసరంలేని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రీపెయిడ్ మొబైల్ యూజర్లకు లబ్ధి చేకూరనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజధాని అమరావతి పనులకు ఆటంకాలు లేకుండా వేగం పెంచాలి: నారాయణ
ఆసియా క్రీడల్లో స్వర్ణం.. కమలినికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా