Share News

ఇంటర్నెట్‌ వేగం, కాల్‌ నాణ్యతపై సమగ్ర సమాచారం

ABN , Publish Date - Nov 05 , 2026 | 02:50 AM

మొబైల్‌, బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ల పనితీరుపై వినియోగదారులకు మరింత స్పష్టత కల్పించేందుకు భారత టెలికాం...

ఇంటర్నెట్‌ వేగం, కాల్‌ నాణ్యతపై సమగ్ర సమాచారం

‘నెట్‌వర్క్‌ అనుభవ్‌’ వేదిక ప్రారంభం

న్యూఢిల్లీ: మొబైల్‌, బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ల పనితీరుపై వినియోగదారులకు మరింత స్పష్టత కల్పించేందుకు భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్‌ ‘నెట్‌వర్క్‌ అనుభవ్‌ ప్లాట్‌ఫామ్‌’ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రియల్‌టైమ్‌ ఇంటర్నెట్‌ వేగం, కాల్‌ నాణ్యత ఎలా ఉన్నాయో మ్యాప్‌ల రూపంలో తెలుసుకునేలా, డౌన్‌లోడ్‌ చేసుకునేలా ఈ డిజిటల్‌ వేదికను రూపొందించింది. ‘మైస్పీడ్‌’, ‘మైకాల్‌’ యాప్‌ల ద్వారా వినియోగదారులు నిర్వహించిన నెట్‌వర్క్‌ పరీక్ష ఫలితాలతో పాటు ట్రాయ్‌ స్వయంగా చేపట్టిన డ్రైవ్‌ టెస్టుల ఫలితాలను కూడా ఒకే వేదిక పైకి తీసుకురావడం ఈ ప్లాట్‌ఫామ్‌ ప్రత్యేకత.

ఇవి కూడా చదవండి..

అమెరికా మిడ్‌టర్మ్ ఫలితాలపై కమలా హారిస్ స్పందన.. 'హల్లెలూయ' వీడియో వైరల్..

అమెరికా కాంగ్రెస్‌పై డెమోక్రాట్ల పట్టు.. భారత్‌ పరిస్థితేంటి..

Updated Date - Nov 05 , 2026 | 02:51 AM