ఇన్నోవా హైక్రాస్ సరికొత్తగా..
ABN , Publish Date - Nov 26 , 2026 | 04:33 AM
టయోటా కిర్లోస్కర్ మోటార్ తన ప్రముఖ మల్టీ పర్పస్ వెహికిల్(ఎంపీవీ) ‘ఇన్నోవా హైక్రాస్’ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను బుధవారం మార్కెట్లోకి...
న్యూఢిల్లీ: టయోటా కిర్లోస్కర్ మోటార్ తన ప్రముఖ మల్టీ పర్పస్ వెహికిల్(ఎంపీవీ) ‘ఇన్నోవా హైక్రాస్’ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్, సరికొత్త ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ హంగులతోపాటు కొత్త ఫీచర్లతో కూడిన ఈ కారు పరిచయ ధర (ఢిల్లీ ఎక్స్ షోరూం) రూ.19.59 లక్షలు. కాగా, ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ వేరియంట్లను కంపెనీ ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో భర్తీ చేసింది. ఈ-20 నుంచి ఈ-85 శ్రేణి వరకు ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌తో నడిచే లా ఈ హైబ్రిడ్ వేరియంట్లను రూపొందించినట్లు టయోటా కిర్లోస్కర్ మోటార్ కంట్రీ హెడ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ గులాటీ తెలిపారు. ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరల శ్రేణి రూ.19.99 లక్షల నుంచి రూ.31.99 లక్షలుగా ఉంది.
ఇవి కూడా చదవండి:
వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా
ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్