ఇరాన్ వార్ ఎఫెక్ట్.. రూ.4.48 లక్షల కోట్లు కోల్పోయిన టాప్-10 కంపెనీలు..
ABN , Publish Date - Mar 15 , 2026 | 07:07 PM
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం భారతీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి సూచీలు భారీగా పతనమవుతూ వస్తున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 4,354 పాయింట్ల మేర పడిపోయింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం భారతీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి సూచీలు భారీగా పతనమవుతూ వస్తున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 4,354 పాయింట్ల మేర పడిపోయింది. ఇక, నిఫ్టీ 1299 పాయింట్లు పతనమైంది. ఇక, దేశీయ మార్కెట్‌లోని టాప్-10 కంపెనీల మార్కెట్ విలువలో సుమారు రూ.4.48 లక్షల కోట్లు ఆవిరయ్యాయి (Rs 4.48 lakh crore market cap erosion).
యుద్ధం కారణంగా చమురు ధరలు భారీగా పెరగడం, డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ పతనం కావడం, దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు నిధుల ఉపసంహరణ, ద్రవ్యోల్బణ భయాల కారణంగా మదుపర్లు తీవ్ర ఆందోళనలకు గురై అమ్మకాలకు దిగారు. యుద్ధ ప్రభావం టాప్-10 కంపెనీలలో అధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై పడింది. ఎస్బీఐ మార్కెట్ విలువ దాదాపు రూ.89 వేల కోట్లు తగ్గి, దాదాపు రూ.9.66 లక్షల కోట్లకు చేరుకుంది (Top 10 firms market cap loss).
ఎస్బీఐ తర్వాతి స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా గణనీయంగా నష్టపోయింది (SBI HDFC Bank market loss). హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ దాదాపు రూ.61 వేల కోట్లు క్షీణించి, దాదాపు రూ.12 లక్షల కోట్లకు చేరుకుంది. ఆ తర్వాతి స్థానంలో బజాజ్ ఫైనాన్స్ (రూ.59 వేల కోట్లు), టీసీఎస్ (రూ.53 వేల కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్ (రూ.42 వేల కోట్లు), భారతీ ఎయిర్‌టెల్ (రూ.38 వేల కోట్లు) కూడా గణనీయంగా మార్కెట్ విలువను కోల్పోయాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా దాదాపు రూ.33 వేల కోట్ల మార్కెట్ విలువను కోల్పోయి రూ.18 లక్షల కోట్లకు చేరుకుంది. అయినప్పటికీ మార్కెట్ విలువ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలోనే ఉంది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ అణు కేంద్ర నగరంపై దాడులు.. విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ విమానాలు..
మీది డేగ చూపు అయితే.. ఇసుకలో దాక్కున్న పామును 5 సెకెన్లలో కనిపెట్టండి