కోకాపేటలో ‘ది స్కైవెన్’ ప్రాజెక్టు
ABN , Publish Date - May 19 , 2026 | 02:04 AM
హైదరాబాద్ కోకాపేట ప్రాంతంలో మరో అలా్ట్ర లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టు ప్రారంభమవుతోంది. ‘ది స్కైవెన్’ పేరుతో ఇ-ఇన్‌ఫ్రా-పింగ్లే వెంచర్స్...
ఒక్కో ఫ్లాటు సగటు ధర రూ.6.2 కోట్లు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కోకాపేట ప్రాంతంలో మరో అలా్ట్ర లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టు ప్రారంభమవుతోంది. ‘ది స్కైవెన్’ పేరుతో ఇ-ఇన్‌ఫ్రా-పింగ్లే వెంచర్స్ ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు ఎకరాల విస్తీర్ణంలో ఒకే టవర్‌లో 63 అంతస్తుల్లో 4 బీహెచ్‌కే ఫ్లాట్లతో మొత్తం 220 ఫ్లాట్లు ఈ వెంచర్‌లో నిర్మిస్తున్నట్టు ఇ-ఇన్‌ఫ్రా మేనేజింగ్ పార్ట్‌నర్ రమేశ్ రెడ్డి చెప్పారు. అత్యాధునిక సదుపాయాలు, వసతులతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఒక్కో ఫ్లాటు సగటు ధర రూ.6.2 కోట్లని తెలిపారు. ఈ ప్రాజెక్టులో ఒక్కో ఫ్లాటు విస్తీర్ణం కూడా 5,662 చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) నుంచి 6,000 ఎస్‌ఎ్‌ఫటీ పైన ఉంటుందన్నారు. దక్షిణ భారత్‌లో ఇదే అత్యంత ఎత్తైన నివాస గృహ ప్రాజెక్టు అన్నారు. 2030 జనవరి నాటికి పూర్తయ్యే ఈ ప్రాజెక్టు కోసం రూ.650 కోట్ల నుంచి రూ.700 కోట్ల వరకు ఖర్చవుతుందని కంపెనీ భావిస్తోంది.
ఇవి కూడా చదవండి..
సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం.. మార్కులు పెరిగితే రీ-ఎవాల్యుయేషన్ ఫీజు పూర్తిగా రీఫండ్..
ఉగ్రవాదికి బట్టతల కష్టాలు.. దాడులు చేయడానికి భారత్‌లోకి చొరబడి..