Share News

హైదరాబాద్‌లో టెస్లా షోరూం

ABN , Publish Date - Jun 18 , 2026 | 05:18 AM

అమెరికా విద్యుత్‌ వాహన దిగ్గజ సంస్థ టెస్లా.. భారత్‌లో విస్తరణ బాట పట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని...

హైదరాబాద్‌లో టెస్లా షోరూం

దేశంలో కంపెనీకి ఇది ఐదవది

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అమెరికా విద్యుత్‌ వాహన దిగ్గజ సంస్థ టెస్లా.. భారత్‌లో విస్తరణ బాట పట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో తన ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను బుధవారం ప్రారంభించింది. కంపెనీకి ఇది దేశంలో ఐదవది. ఇప్పటికే బెంగళూరు, ముంబై, ఢిల్లీ, గురుగ్రామ్‌లలో టెస్లా ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లను నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ ఏర్పాటు ద్వారా తన కార్ల విక్రయాలను మరింతగా పెంచుకోవాలనుకుంటోంది. ఇక్కడి సెంటర్‌లో సరికొత్త మోడల్‌ వై ప్రీమియం రియర్‌ వీల్‌ డ్రైవ్‌, మోడల్‌ వైఎల్‌లను ప్రదర్శనకు ఉంచారు. కస్టమర్లు ఈ కార్లను నేరుగా పరిశీలించి టెస్లా అడ్వైజర్ల ద్వారా అత్యాధునిక ఎలక్ర్టిక్‌ వాహన సాంకేతికత, భద్రతా ఫీచర్లు, పనితీరు తదితరాల గురించి తెలుసుకోవచ్చు. ఈ కార్లను ఈ సెంటర్‌లో, టెస్లా అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. బొల్లారం ఇండస్ర్టియల్‌ ఏరియాలో డెలివరీ, ఆఫ్టర్‌ సేల్స్‌ సర్వీసెస్‌ సదుపాయాన్ని కంపెనీ ఏర్పాటు చేసింది.

ఇవీ చదవండి:

సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్

Updated Date - Jun 18 , 2026 | 05:18 AM