Share News

టెంప్‌సెన్స్‌ లిస్టింగ్‌ అదుర్స్‌

ABN , Publish Date - Aug 29 , 2026 | 03:01 AM

టెంపరేచర్‌ సెన్సింగ్‌, హీటింగ్‌ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ టెంప్‌సెన్స్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌.. లిస్టింగ్‌ రోజే మదుపరులకు అద్భుతమైన లాభాలు...

టెంప్‌సెన్స్‌ లిస్టింగ్‌ అదుర్స్‌

  • ఇష్యూ ధర రూ.300తో పోల్చితే

111% ప్రీమియంతో రూ.631 వద్ద లిస్టింగ్‌

ముంబై: టెంపరేచర్‌ సెన్సింగ్‌, హీటింగ్‌ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ టెంప్‌సెన్స్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌.. లిస్టింగ్‌ రోజే మదుపరులకు అద్భుతమైన లాభాలు అందించింది. కంపెనీ రూ.300 ఇష్యూ ధరతో ఐపీఓకి రాగా శుక్రవారం నాడు బీఎ్‌సఈలో ఏకంగా 110.4 శాతం ప్రీమియంతో రూ.631.20 ధరతో మార్కెట్లో లిస్ట్‌ అయ్యింది. ఆ తర్వాత 111.66 శాతం లాభంతో రూ.635 స్థాయిని తాకింది. చివరకు 95.6 శాతం లాభంతో రూ.634 వద్ద స్థిరపడింది. మరోవైపు ఎన్‌ఎ్‌సఈలో 111.33 శాతం ప్రీమియంతో లిస్టయి చివరకు 95.55 శాతం లాభంతో రూ.586.65 వద్ద క్లోజైంది. కంపెనీ మార్కెట్‌ వాల్యుయేషన్‌ రూ.4,919.30 కోట్లుగా నమోదైంది. ఈ ఏడాది జనవరి 19న భారత్‌ కోకింగ్‌ కోల్‌ 96 శాతం ప్రీమియంతో లిస్ట్‌ కాగా తాజాగా టెంప్‌సెన్స్‌ దాన్ని అధిగమించింది.

ఈ వార్తలనూ చదవండి:

టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..

కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

Updated Date - Aug 29 , 2026 | 03:01 AM