Share News

తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ లాభాలు అదుర్స్‌

ABN , Publish Date - Apr 24 , 2026 | 05:11 AM

లంగాణ గ్రామీణ బ్యాంక్‌ (టీజీబీ) మార్చి 31వ తేదీతో ముగిసిన నాలుగో త్రైమాసికానికి, 2025-26 ఆర్థిక...

తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ లాభాలు అదుర్స్‌

2025-26లో రూ.1,282.84 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ (టీజీబీ) మార్చి 31వ తేదీతో ముగిసిన నాలుగో త్రైమాసికానికి, 2025-26 ఆర్థిక సంవత్సరం మొత్తానికి మంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ కాలానికి బ్యాంక్‌ రూ.1,282.84 కోట్ల నికర లాభం నమోదు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 89.96ు ఎక్కువ. ఇదే సమయంలో బ్యాంక్‌ డిపాజిట్లు 7.58ు వృద్ధితో రూ.34,604.69 కోట్లకు, స్థూల రుణాలు 12.11ు వృద్ధితో రూ.46,547.81 కోట్లకు చేరాయి. బ్యాంక్‌ స్థూల వ్యాపారం సైతం 10.14 శాతం వృద్ధితో రూ.81,152.5 కోట్లకు చేరింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో టీజీబీ స్థూల మొండి బకాయిలు 2.10ు నుంచి 1.98 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలైతే 2024-25 ఆర్థిక సంవత్సరంలో వలెనే జీరో శాతానికి పరిమితమయ్యాయి. రుణ వితరణలో జాగ్రత్తలు, సేవల్లో డిజిటల్‌ విధానాలు, తెలంగాణలోని సెమీ అర్బన్‌, గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం 2025-26 ఆర్థిక సంవత్సరంలో టీజీబీకి బాగా కలిసొచ్చాయని బ్యాంక్‌ చైర్మన్‌ కే ప్రతాప రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి..

శాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్

నెతన్యాహు ప్లాన్‌ను వాళ్లు తిరస్కరించారు.. ట్రంప్ అంగీకరించారు: విదేశాంగ మాజీ కార్యదర్శి

Updated Date - Apr 24 , 2026 | 05:11 AM