Share News

Market Correction India: టెక్‌ వ్యూ మార్కెట్లో కరెక్షన్‌

ABN , Publish Date - Jan 12 , 2026 | 02:19 AM

గత వారం నిఫ్టీ మొత్తం ఐదు రోజులూ డౌన్‌ట్రెండ్‌లోనే ట్రేడయి చివరికి ముందు వారంతో పోల్చితే 645 పాయింట్ల నష్టంతో 25,680 వద్ద కనిష్ఠ స్థాయిలకు చేరువలో ముగిసింది. 26,000 సమీపంలో మూడు నెలల పాటు...

Market Correction India: టెక్‌ వ్యూ మార్కెట్లో కరెక్షన్‌

టెక్‌ వ్యూ మార్కెట్లో కరెక్షన్‌

గత వారం నిఫ్టీ మొత్తం ఐదు రోజులూ డౌన్‌ట్రెండ్‌లోనే ట్రేడయి చివరికి ముందు వారంతో పోల్చితే 645 పాయింట్ల నష్టంతో 25,680 వద్ద కనిష్ఠ స్థాయిలకు చేరువలో ముగిసింది. 26,000 సమీపంలో మూడు నెలల పాటు సాగిన కన్సాలిడేషన్‌, అనిశ్చిత, సైడ్‌వేస్‌ ధోరణి అనంతరం గత వారం బలమైన డౌన్‌ట్రెండ్‌లో పడడం మరింత బలహీనత ఉంటుందనేందుకు సంకేతం. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తం కావాలి. గత కొద్ది నెలల్లో ఏర్పడిన భారీ నష్టం ఇదే. మిడ్‌క్యాప్‌-100 (1610 పాయింట్లు), స్మాల్‌క్యాప్‌-100 (550 పాయింట్లు) సూచీలు సైతం బలమైన కరెక్షన్లు సాధించడం ద్వారా తక్షణ అప్‌ట్రెండ్‌కు స్వల్పకాలిక విరామం ఇచ్చాయి. మార్కెట్లో అన్ని విభాగాల్లోనూ అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా ఉన్నదనేందుకు ఇది సంకేతం. గత వారం కీలక స్థాయి 26,000 వద్ద విఫలమైనందు వల్ల స్వల్పకాలిక బలహీనత మరింతగా కొనసాగవచ్చు.

బుల్లిష్‌ స్థాయిలు: రికవరీ బాట పడితే మరింత అప్‌ట్రెండ్‌ కోసం మైనర్‌ నిరోధం 25,700 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన మానసిక అవధి, నిరోధం 26,000. ఆ పైన నిలదొక్కుకున్నప్పుడే స్వల్పకాలిక సానుకూలత సంకేతం ఇస్తుంది.

బేరిష్‌ స్థాయిలు: మరింత బలహీనత ప్రదర్శిస్తే ప్రస్తుత మద్దతు స్థాయి 25,600 వద్ద తప్పనిసరిగా నిలదొక్కుకోవాలి. ప్రధాన మద్దతు స్థాయి 25,450. భద్రత కోసం ఇక్కడ నిలదొక్కుకుని తీరాలి. ఇక్కడ కూడా విఫలమైతే స్వల్పకాలిక అప్రమత్తత ఏర్పడుతుంది.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ కూడా గత వారం 900 పాయింట్ల మేరకు నష్టపోయి వారం కనిష్ఠ స్థాయి 59,250 వద్ద ముగిసింది. సానుకూలత కోసం ఈ సూచీ మద్దతు స్థాయి 59,000 వద్ద నిలదొక్కుకోవాలి. తదుపరి నిరోధ స్థాయిలు 59,600, 60,000. మద్దతు స్థాయిలు 59,000, 58,600, 58,000.


పాటర్న్‌: వీక్లీ చార్లుల్లో ముందు వారం ఏర్పడిన అప్‌సైడ్‌ రివర్సల్‌ అనంతరం గత వారం బ్రేక్‌డౌన్‌ పాటర్న్‌ ఏర్పడింది. ఇది గరిష్ఠ స్థాయిల్లో ‘‘బుల్‌ట్రాప్‌ పాటర్న్‌’’ సంకేతం. గత వారం మార్కెట్‌ 50, 100 డిఎంఏల కన్నా దిగువకు దిగజారింది. అలాగే మార్కెట్‌ ‘‘ఎగువకు ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా దిగజారింది. ఇది స్వల్పకాలిక అప్రమత్త సంకేతం.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం సోమ, గురు వారాల్లో తదుపరి మైనర్‌ రివర్సల్స్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం: 25,630, 25,700

మద్దతు: 25,540, 25,450

వి. సుందర్‌ రాజా

ఇవీ చదవండి:

ముసుగు ధరించి వస్తే గోల్డ్ విక్రయించం.. వర్తకుల కీలక నిర్ణయం..

ఇతడు మామూలోడు కాదు.. డబ్బు కోసం కట్టుకున్న భార్యను..

Updated Date - Jan 12 , 2026 | 02:19 AM