Share News

టెక్‌ మహీంద్రా లాభాలు అదుర్స్‌

ABN , Publish Date - Apr 23 , 2026 | 05:04 AM

ప్రతికూల పరిస్థితుల్లోనూ ఐటీ దిగ్గజం టెక్‌ మహీంద్రా తన సత్తా చాటింది. ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో...

టెక్‌ మహీంద్రా లాభాలు అదుర్స్‌

  • క్యూ4లో రూ.1,353.8 కోట్లు

  • రూ.36 చొప్పున తుది డివిడెండ్‌

న్యూఢిల్లీ: ప్రతికూల పరిస్థితుల్లోనూ ఐటీ దిగ్గజం టెక్‌ మహీంద్రా తన సత్తా చాటింది. ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో అనుబంధ కంపెనీలతో కలిసి (కన్సాలిడేటెడ్‌) రూ.15,076.1 కోట్ల ఆదాయంపై రూ.1,353.8 కోట్ల నికర లాభం నమోదు చేసిం ది. 2024-25 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ ఆదాయం 12.6ు, నికర లాభం 16ు పెరిగాయి. మూడో త్రైమాసికంతో పోల్చినా కంపెనీ నికర లాభం 20.7 శాతం, ఆదాయం 4.7 శాతం పెరిగాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వాటాదారులకు ఒక్కో షేరుపై రూ.36 చొప్పున తుది డివిడెండ్‌ చెల్లించాలని టెక్‌ మహీంద్రా కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. గత ఏడాది నవంబరులో ఒక్కో షేరుపై చెల్లించిన రూ.15 మధ్యంతర డివిడెండ్‌ను కూడా కలిపితే 2025-26 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ వాటాదారులకు ఒక్కో షేరుపై చెల్లించిన డివిడెండ్‌ రూ.51 అవుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి

యాపిల్‌ కొత్త సారథి జాన్‌ టర్నెస్‌

హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభం రూ.4,488 కోట్లు

Updated Date - Apr 23 , 2026 | 05:04 AM