Share News

టెక్‌ మహీంద్రా 1:1 బోనస్‌ ఇష్యూ

ABN , Publish Date - Oct 16 , 2026 | 05:56 AM

ఐటీ సర్వీసుల కంపెనీ టెక్‌ మహీంద్రా.. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికాని (క్యూ2)కి రూ.1,585.6 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని...

టెక్‌ మహీంద్రా 1:1 బోనస్‌ ఇష్యూ

  • క్యూ2 లాభం రూ.1,586 కోట్లు

న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల కంపెనీ టెక్‌ మహీంద్రా.. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికాని (క్యూ2)కి రూ.1,585.6 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.1,194.5 కోట్ల నికర లాభంతో పోల్చితే వృద్ధి 32.7 శాతం నమోదైంది. సమీక్షా త్రైమాసికంలో కార్యకలాపాల నుంచి కన్సాలిడేటెడ్‌ రాబడి 15.6 శాతం పెరిగి రూ.13,994.9 కోట్ల నుంచి రూ.16,180.2 కోట్లకు చేరుకుంది. త్రైమాసికం వారీగా చూస్తే.. లాభం 8 శాతం, ఆదాయం 3 శాతం మేర పెరిగాయి. లాభాల వృద్ధి నేపథ్యంలో టెక్‌మహీంద్రా బోర్డు రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.15 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఇది 300 శాతానికి సమానం. కాగా కంపెనీ 40వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వాటాదారులకు బోర్డు 1:1 బోనస్‌ ఇష్యూ సిఫారసు చేసింది. డిసెంబరు 15 వరకు బోనస్‌ షేర్లు జారీ చేయనుంది. గడిచిన 11 ఏళ్లలో టెక్‌ మహీంద్రా తొలి బోనస్‌ ఇష్యూ ఇది. ఇంతకు ముందు 2015 మార్చిలో 1:1 బోనస్‌ షేర్లను జారీ చేసింది. కాగా క్యూ2లో 5,446 మంది ఉద్యోగులను నియమించుకోవడంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,52,206కు చేరుకుంది.

ఈ వార్తలనూ చదవండి:

సిబిల్ స్కోర్ పడిపోయిందా..? ఆరు నెలల్లో పెంచుకోండిలా

ఫెయిర్‌ఫాక్స్‌ చేతికి ఐడీబీఐ బ్యాంకు

Updated Date - Oct 16 , 2026 | 05:56 AM