Share News

అపర్ణ టెక్నోపోలిస్‌లో టెక్‌ మహీంద్రా సెంటర్‌

ABN , Publish Date - Jun 22 , 2026 | 05:17 AM

టెక్‌ మహీంద్రా.. హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందుకోసం కొండాపూర్‌లోని అపర్ణ టెక్నోపోలిస్‌ ఐటీ పార్కులో...

అపర్ణ టెక్నోపోలిస్‌లో టెక్‌ మహీంద్రా సెంటర్‌

ముంబై: టెక్‌ మహీంద్రా.. హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందుకోసం కొండాపూర్‌లోని అపర్ణ టెక్నోపోలిస్‌ ఐటీ పార్కులో 3.97 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని పదేళ్ల కాలానికి లీజుకు తీసుకుంది. ప్రారంభంలో ఇందుకు నెలకు రూ.3.06 కోట్ల చొప్పున చెల్లించనుంది. ప్రతి మూడేళ్లకు ఒకసారి ఈ లీజు మొత్తాన్ని 15 శాతం చొప్పున పెంచుతారు. ఈ లెక్కన పదేళ్లలో టెక్‌ మహీంద్రా .. అపర్ణ టెక్నోపోలిస్‌ ఐటీ పార్కుకు రూ.410.93 కోట్లు చెల్లించనుంది. ఈ ఏడాది సెప్టెంబరు 10 నుంచి 2035 డిసెంబరు 9 వరకు ఈ లీజు ఒప్పందం అమల్లో ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

మెకానిక్ కోతి.. సైకిల్‌కు ఎలా పంక్చర్ వేస్తోందో చూడండి..

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 22 , 2026 | 05:17 AM