టెక్ మహీంద్రాలో 30 వేల మంది తొలగింపు.. కంపెనీ స్పందన ఏంటంటే..
ABN , Publish Date - Mar 09 , 2026 | 02:06 PM
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఆంథ్రోపిక్ వంటి ఏఐ స్టార్టప్‌ల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతుందనే అంచనాలు ఐటీ రంగంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ఐటీ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఆంథ్రోపిక్ వంటి ఏఐ స్టార్టప్‌ల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతుందనే అంచనాలు ఐటీ రంగంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ఐటీ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. భారత ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా కూడా లే ఆఫ్‌లు ప్రకటిస్తోందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి (Tech Mahindra layoffs).
దాదాపు 30 వేల మంది ఉద్యోగులను టెక్ మహీంద్రా సంస్థ తొలగించబోతోందంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై తాజాగా సంస్థ ప్రతినిధులు స్పందించారు. అవన్నీ అసత్య కథనాలని స్పష్టం చేశారు. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు టెక్ మహీంద్రా సంస్థ సోమవారం సమాచారం అందించింది. ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి ప్రతిపాదనా తమ వద్ద లేదని, 30 వేల లేఆఫ్‌లు అంటూ వస్తున్న వార్తలు అసత్యాలని స్పష్టం చేసింది (Tech Mahindra job cuts rumours).
ఏజెంటిక్ ఏఐ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థతో కలిసి టెక్ మహీంద్రా పని చేయబోతోంది. ఈ నేపథ్యంలోనే లేఆఫ్‌ల వార్తలు మొదలయ్యాయి (IT sector layoffs India). రాబోయే కొన్ని నెలల్లో టెక్ మహీంద్రా తమ ఉద్యోగుల సంఖ్యను 30 వేల మేర తగ్గించుకునేందుకు సిద్ధమవుతోందని వార్తలు వచ్చాయి. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఆ వార్తలను తాజాగా సంస్థ ఖండించింది. కాగా, టెక్ మహీంద్రా సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 1.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇప్పుడు దాని గురించి ఆలోచన ఎందుకు: రిటైర్మెంట్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు..
ఆ సమయంలో సచిన్ చాలా సహాయం చేశారు: సంజూ శాంసన్