నోయల్ వర్సెస్ శ్రీనివాసన్
ABN , Publish Date - Oct 01 , 2026 | 02:25 AM
టాటా సన్స్ బోర్డు, టాటా ట్రస్ట్‌ల మధ్య వివాదం సరికొత్త మలుపు తిరిగింది. టాటా ట్రస్ట్‌ల్లో కీలక ట్రస్టీతోపాటు టాటా సన్స్ బోర్డులో ట్రస్ట్‌ల తరపు నామినీ డైరెక్టర్ అయిన వేణు శ్రీనివాసన్ ఏకంగా...
టాటా ట్రస్ట్ పాలనపై దర్యాప్తు చేపట్టాలని మహారాష్ట్ర చారిటీ కమిషనర్‌కు వేణు శ్రీనివాసన్ లేఖ
ముంబై: టాటా సన్స్ బోర్డు, టాటా ట్రస్ట్‌ల మధ్య వివాదం సరికొత్త మలుపు తిరిగింది. టాటా ట్రస్ట్‌ల్లో కీలక ట్రస్టీతోపాటు టాటా సన్స్ బోర్డులో ట్రస్ట్‌ల తరపు నామినీ డైరెక్టర్ అయిన వేణు శ్రీనివాసన్ ఏకంగా టాటా ట్రస్ట్‌ల చైర్మన్ నోయల్ టాటాపై నేరుగా విల్లు ఎక్కుపెట్టారు. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌లో పాలన ప్రమాణాలపై దర్యాప్తు జరపాలని మహారాష్ట్ర చారిటీ కమిషనర్‌కు శ్రీనివాసన్ లేఖ రాశారు. టాటా సన్స్ వాణిజ్య వ్యవహారాల్లో ట్రస్ట్ అధికంగా జోక్యం చేసుకుంటోందని, ఆ కంపెనీ బోర్డు సభ్యుడిగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోనివ్వకుండా ట్రస్ట్ అడ్డుకునేందుకు ప్రయత్నించిందని ఆయన కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, ట్రస్ట్‌లో శాశ్వత ట్రస్టీగా నోయల్ టాటా నియామకం, కొనసాగింపుతో పాటు నోయల్ కుమారుడైన నెవిల్లే టాటా నియామకాన్ని ఆయన ప్రశ్నించారు. దీంతో టాటా గ్రూప్ లో నాయకత్వంపై వివాదం మరిం త సంక్లిష్టంగా మారింది. టాటా సన్స్‌లో మెజారిటీ (66 శాతం) వాటా టాటా ట్రస్ట్‌లదే.
కేవియట్ దాఖలు చేసిన నోయల్ టాటా
సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌లో పాలన ప్రమాణాలపై వేణు శ్రీనివాసన్ ఫిర్యాదుపై ఎలాంటి ఆదేశాలు జారీ చేసే ముందు తమ వాదన కూడా వినాలని కోరుతూ నోయల్, నెవిల్లే టాటాలు. మహారాష్ట్ర చారిటీ కమిషనర్‌కు కేవియట్ పిటిషన్ సమర్పించారు.
ఈ వార్తలనూ చదవండి:
బంగారం యూటర్న్.. మరోసారి పెరిగిన ధరలు
‘జీ’ సుభాష్ చంద్ర రుణదాతలకు ఎన్‌సీఎల్‌ఏటీ నోటీసులు