Share News

దాతృత్వ కార్యక్రమాల కోసం రూ.2,000 కోట్లు

ABN , Publish Date - Jun 15 , 2026 | 05:32 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టాటా ట్రస్ట్స్‌ తన దాతృత్వ కార్యక్రమాల కోసం వ్యయాలను దాదాపు రూ.2,000 కోట్లకు పెంచాలని...

దాతృత్వ కార్యక్రమాల కోసం రూ.2,000 కోట్లు

టాటా ట్రస్ట్స్‌ సీఈవో సిద్ధార్థ్‌ శర్మ

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టాటా ట్రస్ట్స్‌ తన దాతృత్వ కార్యక్రమాల కోసం వ్యయాలను దాదాపు రూ.2,000 కోట్లకు పెంచాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని టాటా ట్రస్ట్స్‌ సీఈవో సిద్ధార్థ్‌ శర్మ వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో టాటా ట్రస్ట్స్‌ దాతృత్వ కార్యక్రమాల కోసం దాదాపు రూ.1,600 కోట్లు ఖర్చు చేయగా.. 2026-27లో ఇది రూ.2,000 కోట్లకు పెరగనుందని పేర్కొన్నారు. ఈ స్థాయిలో ఖర్చు చేయడం వల్ల అసోమ్‌, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల ప్రజలకు నాణ్యమైన, అందుబాటు ధరల్లో క్యాన్సర్‌ చికిత్సను అందించడం తమకు సాధ్యమైందన్నారు. మరోవైపు అండర్‌గ్రాడ్యుయేట్‌ విద్య కోసం ఒక ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకుగాను ప్రముఖ విద్యా సంస్థతో కలిసి పని చేసే అంశాన్ని టాటా ట్రస్ట్స్‌ ఖరారు చేస్తోందని చెప్పారు. మధ్య భారతంలో అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు కోసం తమ వంతు సహకారాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. టాటా ట్రస్ట్స్‌లో అంతర్గతంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయంటూ మీడియాలో వస్తున్న కథనాలపైనా ఆయన లింక్డ్‌ఇన్‌ వేదికగా స్పందించారు. దురదృష్టవశాత్తు కొన్నిసార్లు సరైన విశ్లేషణ, ధ్రువీకరణ లేకుండా కొన్ని కథనాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్టు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

AIADMKకి సినీ నటి గౌతమి రాజీనామా

అన్‌స్టాపబుల్‌గా అమరావతి నిర్మాణం.. మంత్రి లోకేశ్ వీడియో పోస్ట్

Updated Date - Jun 15 , 2026 | 05:32 AM