Share News

భాయ్‌ హీరాబాయ్‌ ట్రస్ట్‌ నిబంధనల సవరణ

ABN , Publish Date - Apr 20 , 2026 | 01:49 AM

భాయ్‌ హీరాబాయ్‌ ట్రస్ట్‌ ట్రస్టీల నియామక అర్హతలను సవరించాలని టాటా ట్రస్ట్‌ నిర్ణయించింది. ముఖ్యంగా ఈ ట్రస్టులో పార్శీయేతరులను...

భాయ్‌ హీరాబాయ్‌ ట్రస్ట్‌ నిబంధనల సవరణ

న్యూఢిల్లీ: భాయ్‌ హీరాబాయ్‌ ట్రస్ట్‌ ట్రస్టీల నియామక అర్హతలను సవరించాలని టాటా ట్రస్ట్‌ నిర్ణయించింది. ముఖ్యంగా ఈ ట్రస్టులో పార్శీయేతరులను ట్రస్టీలుగా నియమించేందుకు అడ్డంకిగా ఉన్న నిబంధనలను సవరించాలని నిర్ణయించింది. భాయ్‌ హీరాబాయ్‌ ట్రస్ట్‌ ఈ మేరకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. టాటా ట్రస్ట్‌ మాజీ ట్రస్టీ మెహ్లీ మిస్త్రీ.. ప్రముఖ పారిశ్రామికవేత్త, టీవీఎస్‌ గ్రూప్‌ అధినేత వేణు శ్రీనివాసన్‌, రక్షణ శాఖ మాజీ కార్యదర్శి విజయ్‌ సింగ్‌లను భాయ్‌ హీరాబాయ్‌ ట్రస్ట్‌ ట్రస్టీలుగా నియమించడాన్ని సవాల్‌ చేయడంతో టాటా ట్రస్ట్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఈ వార్తలనూ చదవండి:

శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ

భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో

Updated Date - Apr 20 , 2026 | 01:49 AM