Share News

టాటా సన్స్‌ విభజన!?

ABN , Publish Date - Sep 17 , 2026 | 05:11 AM

టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌ స్టాక్‌ మార్కెట్లో షేర్ల లిస్టింగ్‌ను తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను...

టాటా సన్స్‌ విభజన!?

  • మార్కెట్లో లిస్టింగ్‌ను తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న కంపెనీ

  • నేడు బోర్డు సమావేశంలో చర్చించే అవకాశం

ముంబై: టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌ స్టాక్‌ మార్కెట్లో షేర్ల లిస్టింగ్‌ను తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా కంపెనీని రెండుగా విభజించడం లేదా రుణాల తిరిగి చెల్లింపు, కీలకేతర ఆస్తుల విక్రయం ద్వారా బ్యాలెన్స్‌ షీటు సైజును తగ్గించుకునే యోచనలో ఉన్నట్లు బ్లూంబర్గ్‌ కథనం వెల్లడించింది. గురువారం జరుగనున్న టాటా సన్స్‌ బోర్డు సభ్యుల సమావేశంలో ఈ విషయంపైనా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే, టాటా సన్స్‌లో 66 శాతం వాటా కలిగిన టాటా ట్రస్టుల చైర్మన్‌ నోయల్‌ టాటా.. కంపెనీ లిస్టింగ్‌కు సుముఖంగా లేరు. టాటా ట్రస్ట్‌ల దాతృత్వ కార్యక్రమాలకు టాటా సన్స్‌ లిస్టింగ్‌ అవాంతరంగా మారవచ్చన్నది ఆయన వాదన. అయితే, టాటా ట్రస్ట్‌ సభ్యుల్లో ఈ విషయంపై భిన్న అభిప్రాయాలున్నాయి. . ముఖ్యంగా టాటా సన్స్‌లో 18 శాతం వాటా కలిగిన షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌.. కంపెనీ లిస్టింగ్‌కు పట్టుబడుతోంది. మార్కెట్లో లిస్టింగ్‌ ద్వారానే తమ వాటాకు సరైన విలువ లభిస్తుందని ఆ గ్రూప్‌ భావిస్తోంది.

Also Read:

భారత సినీ రంగానికి అనంత్ నాగ్‌ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్

రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 17 , 2026 | 05:11 AM