సంధి కుదిరేనా.. సమరమేనా..?
ABN , Publish Date - Nov 30 , 2026 | 05:04 AM
టాటా గ్రూప్ ప్రధాన వ్యాపారాల ప్రమోటర్ కంపెనీ టాటా సన్స్ బోర్డు నవంబరు 30న (సోమవారం) భేటీ కానుంది. టాటా ట్రస్ట్‌లు, వాటి చైర్మన్ నోయల్ టాటాతో టాటా సన్స్ బోర్డు విభేదాలు తారా స్థాయికి చేరడంతో....
టాటా సన్స్ బోర్డు భేటీ నేడే..
కంపెనీ లిస్టింగ్ లేదా ప్రత్యామ్నాయ మార్గాలు, చంద్ర పునర్నియామకంపైనే ప్రధానంగా చర్చ
టాటా ట్రస్ట్‌లతో విభేదాల నేపథ్యంలో అత్యంత కీలకంగా మారిన సమావేశం
ముంబై: టాటా గ్రూప్ ప్రధాన వ్యాపారాల ప్రమోటర్ కంపెనీ టాటా సన్స్ బోర్డు నవంబరు 30న (సోమవారం) భేటీ కానుంది. టాటా ట్రస్ట్‌లు, వాటి చైర్మన్ నోయల్ టాటాతో టాటా సన్స్ బోర్డు విభేదాలు తారా స్థాయికి చేరడంతో పాటు ఇరు వర్గాలు కోర్టుకెక్కిన తరుణంలో ఈ సమావేశం అత్యంత కీలకంగా మారింది. ఆర్‌బీఐ మార్గదర్శకాలకు లోబడి టాటా సన్స్‌ను స్టాక్ మార్కెట్లో నమోదు చేయడం లేదా టాటా ట్రస్ట్‌లు ప్రతిపాదించిన సంస్థ వ్యాపార పునర్‌వ్యవస్థీకరణను పరిగణించడం, సంస్థ చైర్మన్‌గా చంద్రశేఖరన్ పునర్నియామకానికి షేర్‌హోల్డర్ల ఆమోదం కోసం అసాధారణ సమావేశం (ఈజీఎం) ఏర్పాటును కోరడంతో పాటు గ్రూప్ వ్యాపారాల ఫండింగ్ అవసరాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. మార్కెట్ లిస్టింగ్‌తో పాటు చంద్ర పునర్నియామకాన్ని ట్రస్ట్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో టాటా సన్స్ బోర్డు ఏం నిర్ణయం తీసుకుంటుందా అని ఇండస్ట్రీ, మార్కెట్ వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.
సంస్థలో మా వాటాను కొనుగోలు చేయరూ
కంపెనీలోని తమ 18 శాతం వాటాలో కొంత కొనుగోలు చేయడం ద్వారా రూ.25,000 కోట్లు సమకూరేలా చూడాలని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్‌కు షాపూర్‌జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్ ఈ నెల 23న లేఖ రాసింది. తమ గ్రూప్ తిరిగి చెల్లించాల్సిన అప్పులకు సమయం దగ్గర పడుతోందని, అందుకే షేర్ల బైబ్యాక్ లేదా బోర్డుకు ఆమోదయోగ్యమైన ఒక్కరు లేదా పలువురికి షేర్ల విక్రయం ప్రతిపాదనలను పరిగణించాలని ఎస్‌పీ గ్రూప్ చైర్మన్ షాపూర్‌జీ పల్లోంజీ లేఖలో సూచించారు. సోమవారం నాటి సమావేశంలో తమ ప్రతిపాదనను కూడా బోర్డు ముందు ఉంచాలని టాటా సన్స్‌ను పల్లోంజీ కోరారు.
ఎస్‌పీ గ్రూప్
ఈ వార్తలూ చదవండి
బిల్లుకు 371 మంది ఎంపీల మద్దతు ఖాయం.. రాహుల్ ఆరోపణల్లో నిజం లేదు: కేంద్రం
మద్దతు వెనక్కి తీసుకుంటే, పవార్ కాళ్లు మొక్కుతా: మహారాష్ట్ర కాంగ్రెస్ నేత