Share News

‘టాటా పవర్‌ ఈజీ హోమ్‌’ సొల్యూషన్లు

ABN , Publish Date - Apr 23 , 2026 | 05:06 AM

టాటా పవర్‌ ‘‘ఈజీ హోమ్‌ సొల్యూషన్స్‌’ను హైదరాబాద్‌ మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో స్మార్ట్‌ సాకెట్లు...

‘టాటా పవర్‌ ఈజీ హోమ్‌’ సొల్యూషన్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): టాటా పవర్‌ ‘‘ఈజీ హోమ్‌ సొల్యూషన్స్‌’ను హైదరాబాద్‌ మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో స్మార్ట్‌ సాకెట్లు, టచ్‌ ప్యానెల్‌ స్విచ్‌లు, రెట్రోఫిటబుల్‌ కన్వర్టర్లు, మోషన్‌ సెన్సర్లు వంటి ఉత్పత్తులు ఉన్నా యి. అన్ని భద్రతా ప్రమాణాలతో రూపొందించిన ఈజీ హోమ్‌ గృహోపకరణాలు.. యాప్‌ ఆధారిత నియంత్రణ, రియల్‌ టైమ్‌ మానిటరింగ్‌, ఇంటెలిజెంట్‌ ఆటోమేషన్‌ వంటి ఫీచర్లతో వస్తున్నాయి. కొత్త ఇళ్లకే కాకుండా అన్ని ఇళ్లలోనూ ఈ పరికరాలను ఏర్పాటు చేసుకోవచ్చునని కంపెనీ తెలిపింది. వోల్టేజ్‌ హెచ్చుతగ్గుల నుంచి రక్షణ కల్పించే ఓవర్‌ లోడ్‌ ప్రొటెక్షన్‌తో ఈ ఉత్పత్తులు వస్తున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి

యాపిల్‌ కొత్త సారథి జాన్‌ టర్నెస్‌

హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభం రూ.4,488 కోట్లు

Updated Date - Apr 23 , 2026 | 05:06 AM