టాటా నానో.. ఎలక్ట్రిక్ కారుగా రీఎంట్రీ!?
ABN , Publish Date - Aug 11 , 2026 | 03:51 AM
సామాన్యులకు సైతం సొంత కారు కలను నిజం చేయాలన్న రతన్ టాటా ఆలోచన నుంచి పురుడు పోసుకున్న టాటా నానో కారు తిరిగి...
న్యూఢిల్లీ: సామాన్యులకు సైతం సొంత కారు కలను నిజం చేయాలన్న రతన్ టాటా ఆలోచన నుంచి పురుడు పోసుకున్న టాటా నానో కారు.. తిరిగి మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. టాటా నానో ఎలక్ట్రిక్ కారుగా పునః ప్రవేశం చేయవచ్చని టాటా మోటార్స్ ఇండియా డిజైన్ హెడ్ అజయ్ జైన్ సంకేతాలిచ్చారు. అంతర్జాతీయ ఆటోమొబైల్ రంగంలో సంచలనమైన టాటా నానో.. 2009లో మార్కెట్లోకి ప్రవేశించింది. రూ.లక్ష ధరతో ప్రపంచంలోనే అత్యంత చవక కారుగా నిలిచింది. కానీ, ప్రజాదరణ లేక ఈ కారు కొన్నేళ్ల క్రితమే షోరూమ్‌ల నుంచి కనుమరుగైంది.
ఇవి కూడా చదవండి:
ఫిట్‌నెస్ కోసం 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్ ఈసారైనా నిరూపించుకుంటాడా?
2027 వన్డే ప్రపంచకప్.. జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నా: భువనేశ్వర్ కుమార్