టాటా మోటార్స్ నుంచి 17 సరికొత్త ట్రక్కులు
ABN , Publish Date - Jan 21 , 2026 | 02:09 AM
టాటా మోటార్స్.. మార్కెట్లోకి సరికొత్త ట్రక్కులను తీసుకువచ్చింది. మంగళవారం నాడిక్కడ 7 నుంచి 55 టన్నుల సామర్థ్యం కలిగిన 17 ట్రక్కులను కంపెనీ...
న్యూఢిల్లీ: టాటా మోటార్స్.. మార్కెట్లోకి సరికొత్త ట్రక్కులను తీసుకువచ్చింది. మంగళవారం నాడిక్కడ 7 నుంచి 55 టన్నుల సామర్థ్యం కలిగిన 17 ట్రక్కులను కంపెనీ విడుదల చేసిం ది. ఇందులో ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) ట్రక్కులు కూడా ఉన్నాయి. అలాగే కొత్తగా అజురా సిరీ్‌సలో మధ్య, తేలికపాటి వాణిజ్య వాహనాల (ఐఎల్‌ఎంసీవీ)ను తీసుకువచ్చింది. దీంతోపాటు ఇంటలిజెంట్ మాడ్యులర్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆర్కిటెక్చర్ (ఐ-ఎంఈవీ) ఆధారంగా ఎలక్ట్రిక్ ట్రక్కుల శ్రేణి వాహనాలను టాటా ట్రక్స్.ఈవీ కింద మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుత రవాణా రంగ అవసరాలకు తగ్గట్టుగా సరికొత్త రూపం, సదుపాయాలతో ఈ వాహన శ్రేణిని తీసుకువచ్చినట్లు టాటా మోటార్స్ ఎండీ, సీఈఓ గిరీష్ వాఘ్ వెల్లడించారు.
ఇవీ చదవండి:
భారత్ వృద్ధి రేటు 7.3 శాతం.. ఐఎమ్ఎఫ్ అంచనా
మార్కెట్‌ను ముంచిన టారిఫ్ భయాలు