Tata Motors Shailesh Chandra: 10 శాతం వృద్ధి
ABN , Publish Date - Jan 14 , 2026 | 05:56 AM
భారత ప్రయాణికుల వాహన (పీవీ) రంగం ఈ ఏడాది గణనీయంగా పుంజుకోనుంది. జీఎ్‌సటీ రేట్ల తగ్గింపు, పెరుగుతున్న ఎస్‌యూవీల డిమాండ్ కారణంగా, 2026లో ప్రయాణికుల వాహనాల....
ఈ ఏడాది కార్ల విక్రయాల్లో టాటా మోటార్స్ పీవీ ఎండీ శైలేష్ చంద్ర
న్యూఢిల్లీ: భారత ప్రయాణికుల వాహన (పీవీ) రంగం ఈ ఏడాది గణనీయంగా పుంజుకోనుంది. జీఎ్‌సటీ రేట్ల తగ్గింపు, పెరుగుతున్న ఎస్‌యూవీల డిమాండ్ కారణంగా, 2026లో ప్రయాణికుల వాహనాల విక్రయాలు దాదాపు 10 శాతం మేర వృద్ధి చెందే అవకాశముందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఏంపీవీ) ఏండీ, సీఈఓ శైలేష్ చంద్ర తెలిపారు. 2025లో తొలి ఎనిమిది నెలలు పీవీ సెగ్మెంట్‌లో మందగమనం కొనసాగినప్పటికీ, జీఎ్‌సటీ రేట్ల తగ్గింపు అనంతరం ఈ విభాగం 20 శాతం మేర వృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఈ నెలలోనే పంచ్, సఫారీ, సియెర్రా, హారియర్ మోడళ్లలో పెట్రోల్ వేరియంట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.
‘పంచ్’ అప్‌డేటెడ్ వెర్షన్ విడుదల
అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘పంచ్’ అప్‌డేటెడ్ వెర్షన్‌ను కంపెనీ విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.5.59 లక్షలు. తమ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ ప్రస్తుతం నెలకు 40,000 విక్రయాలను నమోదు చేస్తోందని, భవిష్యత్‌లో ఈ సంఖ్య 50,000 చేరుకుని అవకాశముందని శైలేష్ చంద్ర తెలిపారు.
ఇవీ చదవండి:
అల్ ఫలా వర్సిటీ క్యాంపస్ అటాచ్!
వారాణసీ స్కూళ్లలో తమిళం తరగతులు!